Updated : 24 Jul 2021 18:55 IST

Vishal Enemy: ప్రపంచంలో ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా? నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే’ అంటున్నారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. విశాల్‌, ఆర్య కీలక పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఎనిమీ’. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. టైటిల్‌కు తగినట్లుగానే ఆద్యంతం ఉత్కంఠ కలిగించే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.

స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఎవరి బలహీనతలతో ఎవరు ఆడుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సెప్టెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో తంబి రామయ్య, కరుణాకరన్‌, మమతా మోహన్‌దాస్‌, మిర్నళిని రవి తదితరులు కీలక పాత్రలు పోసిస్తున్నారు. విశాల్‌, ఆర్య కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వాడు-వీడు’ వచ్చింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని