Nadigar Sangam: మూడేళ్ల ఎదురుచూపులు.. గెలుపు ఆనందంలో విశాల్‌ టీమ్‌

దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ (నడిగర్ సంఘం‌) ఫలితాలు ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో నాజర్‌, విశాల్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. నటీనటుల సంక్షేమం, నడిగర్‌ సంఘానికి ప్రత్యేక భవనం వంటి...

Published : 21 Mar 2022 10:55 IST

చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ (నడిగర్ సంఘం‌) ఫలితాలు ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో నాజర్‌, విశాల్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. నటీనటుల సంక్షేమం, నడిగర్‌ సంఘానికి ప్రత్యేక భవనం వంటి అజెండాలతో నడిగర్‌ సంఘం ఎన్నికల్లో నాజర్‌ అధ్యక్షతన విశాల్‌, కార్తీ వంటి నటులు సభ్యులుగా పాండివర్‌ టీమ్‌ బరిలో నిలిచింది. వీరికి ప్రత్యర్థులుగా భాగ్యరాజ్‌ అధ్యక్షతన శంకర్‌ దాస్‌ జట్టు పోటీలోకి దిగింది. హోరాహోరీ ప్రచారం అనంతరం 2019 జూన్‌ నెలలో నడిగర్‌ సంఘం ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ శంకర్‌దాస్‌ జట్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, వెంటనే ఫలితాలు వెల్లడించాలని కోర్టు తీర్పునివ్వడంతో.. ఆదివారం చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో విశ్రాంత న్యాయమూర్తి సమక్షంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 1701 ఓట్లతో నాజర్‌ బృందం విజయం సాధించిందని ప్రకటించారు. మరోవైపు నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల విశాల్‌, కార్తి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తన తదుపరి చిత్రం ‘లాఠి’ సెట్‌లో విశాల్‌ వేడుకలు జరుపుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని