Vishal: నటితో వివాహంపై విశాల్‌ క్లారిటీ.. అనుకున్నది అయ్యాకే!

తన వివాహం గురించి నటుడు విశాల్‌ (VIshal) స్పందించారు. తన కొత్త చిత్రం ‘లాఠీ’ సినిమా వేడుకలో ఆయన పెళ్లి గురించి మాట్లాడారు.

Published : 14 Nov 2022 01:12 IST

హైదరాబాద్‌: తన వివాహం గురించి నటుడు విశాల్‌ (VIshal) స్పందించారు. తన కొత్త చిత్రం ‘లాఠీ’ సినిమా వేడుకలో ఆయన పెళ్లి గురించి మాట్లాడారు. ఈ హీరో వివాహం గురించి కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘అభినయతో మీ పెళ్లి అంటూ అభిమానులు అంటున్నారు’ అని యాంకర్‌ అడగ్గా.. ‘ప్రతి దానికీ ఓ సమయం ఉంటుంది. నేను ఇచ్చిన మాట నెరవేర్చుకుంటా. సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌ బిల్డింగ్‌ పూర్తయిన వెంటనే నా పెళ్లి జరుగుతుంది. 3500 మంది థియేటర్‌ ఆర్టిస్ట్‌లు ఇంకా చిరిగిన బట్టలు, మేకప్‌ లేకుండానే నాటకాలు వేస్తున్నారు. 35 ఏళ్లనాడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. వారంతా బాగుండాలనే వారికి భవనం కట్టించి, ఫించను ఇప్పించి, ఇతర సదుపాయాలు కల్పించి జీవన విధానాన్ని మార్చాలనుకున్నాం. ఆ ఆశయం నెరవేరకుండానే పెళ్లి చేసుకోవాలనే తొందర లేదు. నా వివాహాం ఎప్పుడో మీ అందరికీ చెబుతా, మీరు తప్పకుండా రావాలి’’ అని విశాల్‌ అన్నారు. 

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకటేశ్‌, మహేశ్‌బాబుల సోదరిగా కనిపించిన నటే అభినయ. ‘నేనింతే’ సినిమాతో నటిగా మారిన ఆమె ‘కింగ్‌’, ‘శంభో శివ శంభో’, ‘దమ్ము’, ‘ధ్రువ’, ‘రాజుగారి గది 2’ తదితర తెలుగు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేశారు. ఇక దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ (నడిగర్ సంఘం‌)కు విశాల్‌ కార్యదర్శి.  విశాల్‌ హీరోగా ఎ.వినోద్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లాఠీ’ (Lathi). రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునయన కథానాయిక. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని