Lathi: ‘లాఠీ’ లుక్‌ విడుదల

విశాల్‌ కథానాయకుడిగా రానా ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘లాఠీ’. ఎ.వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ, నంద నిర్మాతలు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాతో విశాల్‌ పాన్‌ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పీటర్‌ హెయిన్‌ 

Updated : 07 Apr 2022 12:11 IST

విశాల్‌ కథానాయకుడిగా రానా ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘లాఠీ’. ఎ.వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ, నంద నిర్మాతలు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాతో విశాల్‌ పాన్‌ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పీటర్‌ హెయిన్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి ఉందని చెప్పే కథ ఇది. విశాల్‌ ‘లాఠీ’ సమాజంలో ఎలాంటి మార్పులకి నాంది పలికిందనేది తెరపైనే చూడాలి. దర్శకుడు వినోద్‌కుమార్‌ సరికొత్త కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషల్లోనూ ఇదే పేరుతో చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. విశాల్‌కి జోడీగా సునైన నటించింది.   బాలసుబ్రమణ్యన్‌ ఛాయాగ్రాహకుడు, సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని