పెళ్లిపై స్పందించిన విశాల్‌

తన నటనతో కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమలో సైతం క్రేజ్‌  సొంతం చేసుకున్నారు నటుడు విశాల్‌. ఆయన పెళ్లి గురించి ఎంతో కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే....

Published : 26 Feb 2021 01:22 IST

త్వరలోనే శుభవార్త చెప్పొచ్చు..!

హైదరాబాద్‌: తన నటనతో కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమలో సైతం ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నటుడు విశాల్‌. ఆయన పెళ్లి గురించి ఎంతో కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివాహం గురించి ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని.. వేరొకరితో రిలేషన్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. అంతేకాకుండా తాను విధిని నమ్ముతానని.. కాబట్టి, దేవుడు ఎలాంటి రాతను రాస్తే జీవితం అలా కొనసాగుతుంది.. ఇప్పటివరకూ అలాగే జరిగిందని తెలిపారు. త్వరలోనే ఓ శుభవార్త చెప్పాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా అందరికీ వెల్లడిస్తానని విశాల్‌ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

‘యాక్షన్‌’ తర్వాత విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చక్ర’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం.ఎస్‌.ఆనందన్‌ దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్‌, రెజీనా కథానాయికలు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చారు. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు విశాల్‌ ‘తుప్పరివాలం-2’ స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని