Vishal: యూత్‌ ఐకాన్‌, ఉత్తమ నిర్మాతగా విశాల్‌

‘స్టార్టప్‌ ఇండియా మ్యాగజైన్‌’.. పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ‘బిజినెస్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌’ (2021 సంవత్సరానికిగానూ) పేరిట అవార్డులు అందించింది.

Published : 01 Apr 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్టార్టప్‌ ఇండియా మ్యాగజైన్‌’.. పలు రంగాల ప్రముఖులకు ‘బిజినెస్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌’ (2021కి గానూ) పేరిట అవార్డులు అందించింది. సినిమాకు సంబంధించి నటుడు విశాల్‌ రెండు పురస్కారాలను స్వీకరించారు. యూత్‌ ఐకాన్‌, ఉత్తమ నిర్మాతగా అవార్డు అందుకున్న ఆయన సోషల్‌ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకునేలా ఇవి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. పలు వైవిధ్యభరిత చిత్రాలతో నటుడిగా అలరించిన విశాల్‌ 2013లో ‘విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ’ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్నింటిలో తానే హీరోగా నటించారు. ప్రస్తుతం ఆయన ‘లాఠీ’ అనే పాన్‌ ఇండియా చిత్రంతో బిజీగా ఉన్నారు. రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ. వినోద్‌ దర్శకుడు. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విశాల్‌ పోలీసు అధికారికగా కనిపించనున్నారు. సునైనా కథానాయిక. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని