Vishal: ఉత్కంఠగా విశాల్‌ ‘సామాన్యుడు’ ట్రైలర్‌

‘‘ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే, దాన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నామన్నది ఒక మంచి పోలీస్‌ ఆఫీసర్‌కి ముఖ్యమైన అర్హత’’ అంటున్నారు విశాల్‌.

Updated : 19 Jan 2022 18:38 IST

హైదరాబాద్‌: ‘‘ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే, దాన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నామన్నది ఒక మంచి పోలీస్‌ ఆఫీసర్‌కి ముఖ్యమైన అర్హత’’ అంటున్నారు విశాల్‌(Vishal). ఆయన కథానాయకుడిగా తు.ప.శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామాన్యుడు’(Saamanyudu). డింపుల్‌ హయాతీ కథానాయిక. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌(Saamanyudu Trailer )ను విడుదల చేశారు. విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో, ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాజనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సామాన్యుడు’ విశాల్‌ నటిస్తున్న 31వ చిత్రం కావడం విశేషం. ‘నేనొక సామాన్యుడిని ఎదురు తిరగకపోతే నన్నూ చంపేస్తారు’ అంటూ విశాల్‌ చెప్పడం చూస్తే, అతడు ఎవరిపై పోరాటం చేయాల్సి వచ్చింది? అందుకు కారణాలేంటి? విశాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయ్యాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని