Vishal Samanyudu Review: రివ్యూ: సామాన్యుడు
విశాల్ కథానాయకుడిగా నటించిన ‘సామాన్యుడు’ ఎలా ఉందంటే..
చిత్రం: సామాన్యుడు; నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి, రవీనా రవి, మనోహర్ తదితరులు; దర్శకత్వం: తు ప శరవణన్; నిర్మాత: విశాల్; సంగీతం: యువన్ శంకర్ రాజా; సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజా; ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్; కళ: ఎస్ఎస్ మూర్తి
యాక్షన్ కథలకి కేరాఫ్ అడ్రస్ విశాల్. సాంకేతికత, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తుంటారు. ఈసారి క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ‘సామాన్యుడు’ చేశారు. జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా ఈ వారం విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులని థ్రిల్‌కి గురి చేసిందా? లేదా? తెలుసుకోవాలంటే ముందు కథేంటో చూద్దాం పదండి.
కథ: పోరస్(విశాల్) పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనే ఓ సామాన్య యువకుడు. మైథిలి (డింపుల్ హయాతి)తో ప్రేమలో ఉంటాడు. కుటుంబం, కలలే ప్రపంచంగా బతుకుతున్న పోరస్ చెల్లెలు ద్వారక ఓ పోకిరి వల్ల ఇబ్బంది పడుతుంది. పోకిరి నుంచి ద్వారకను కాపాడుకునే క్రమంలోనే ఆమె హత్యకు గురవుతుంది. ద్వారకతో పాటు మరి కొన్ని హత్యలు కూడా జరుగుతాయి. ఈ హత్యల వెనక రాజకీయం ఉంటుంది. ఆ వలయాన్ని ఛేదించి హత్యల వెనకున్న హంతకులను పోరస్ ఎలా బయటకు తీశాడన్నదే ఈ కథ.
ఎలా ఉందంటే: క్రైమ్ డ్రామాతో కూడిన ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. చాలా సినిమాల్లో చూసిన సాధారణ కథే. కానీ, దర్శకుడు ప్రత్యేకమైన కథనంతో సినిమాని అసక్తికరంగా మార్చాడు. ఆరంభ సన్నివేశాలు సాదా సీదాగానే అనిపించినా, కథలోకి రాజకీయం ప్రవేశించాక ఆసక్తికరంగా మారుతుంది. కథానాయకుడి చెల్లెలు, దివ్య అనే యువతి, సామాజక కార్యకర్త కథలని ముడిపెట్టిన విధానం మెప్పిస్తుంది. ప్రథమార్థం హత్యోదంతాలు, బాధితుల నేపథ్యాల పరిచయంతో సాగుతుంది. ఆ హత్యల వెనకున్న హంతకులను కథానాయకుడు వేటాడే క్రమమే ద్వితీయార్థం. విరామానికి ముందు సన్నివేశాలు, పతాక సన్నివేశాలు మరింత బిగితో సాగుతాయి. గౌరవం, పలుకుబడి కోసం కొంతమంది రాజకీయ నాయకులు చేసే ఆకృత్యాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. విశాల్ మార్క్ యాక్షన్ కథ ఇది.
ఎవరెలా చేశారంటే: విశాల్‌కి అలవాటైన పాత్రే ఇది. పోరస్‌గా మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సామాన్య యువకుడి పాత్రలో ఒదిగిపోయారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. డింపుల్ హయాతి కథానాయకుడి ప్రియురాలిగా కనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ, ఉన్నంతలో అందంగా కనిపించింది. యోగిబాబు కథానాయకుడి స్నేహితుడిగా ప్రథమార్థంలో నవ్వించాడు. విశాల్ చెల్లెలిగా రవీనారవి, తల్లిగా తులసి ఆయా పాత్రలపై ప్రభావం చూపించారు. సాంకేతిక విభాగంలో యువన్ సంగీతం హైలెట్‌గా నిలిచింది. కెవిన్ కెమెరా పనితనం పర్వాలేదు. దర్శకుడు శరవణన్ కథనంపై
ప్రభావం చూపించారు. తెలిసిన కథే అయినా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు.
బలాలు
+విశాల్ నటన
+కథనం, థ్రిల్లింగ్ అంశాలు
+ద్వితీయార్థం
బలహీనతలు
-ఆరంభ సన్నివేశాలు
-తెలిసిన కథ
చివరిగా: సామాన్యుడు అలరిస్తాడు..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!