Vishal: ‘డిటెక్టివ్‌-2’ షూటింగ్‌పై విశాల్‌ ఏమన్నారంటే?

విశాల్‌ కథానాయకుడిగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘తుప్పరివాలన్‌’.

Published : 06 Dec 2021 20:02 IST

హైదరాబాద్‌: విశాల్‌ కథానాయకుడిగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘తుప్పరివాలన్‌’. తెలుగులో ‘డిటెక్టివ్‌’ పేరుతో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘డిటెక్టివ్‌’కు కొనసాగింపు మరో సినిమా ఉంటుందని విశాల్‌ ఎప్పుడో ప్రకటించారు. అయితే, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ మొదలు కాలేదు.

ఈ నేపథ్యంలో ‘డిటెక్టివ్‌-2’ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు విశాల్‌ తెలిపారు. జనవరి నుంచి లండన్‌లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని వెల్లడించారు. అంతేకాదు, ఈ చిత్రంతో విశాల్‌ దర్శకుడిగానూ మారబోతున్నారు. తొలి చిత్రానికి మిస్కిన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సీక్వెల్‌ను కూడా ఆయనే తెరకెక్కించాల్సి ఉంది. కానీ, విశాల్‌తో అభిప్రాయభేదాలు రావడంతో ప్రాజెక్టు నుంచి పక్కకు వెళ్లిపోయారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని