Vishwak: ఖరీదైన కారు కొన్న విశ్వక్‌.. అది నాదే అంటూ దర్శకుడి పోస్ట్‌

‘అశోకవనంలో అర్జునకల్యాణం’తో సూపర్‌ సక్సెస్‌ని సొంతం చేసుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న ఆయన ఇప్పుడు తన కలను సాకారం చేసుకున్నారు. తనకిష్టమైన బెంజ్‌ జీక్లాస్‌ 2022...

Updated : 18 May 2022 14:02 IST

హైదరాబాద్‌: ‘అశోకవనంలో అర్జునకల్యాణం’తో సక్సెస్‌ని సొంతం చేసుకున్నాడు నటుడు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ.. తన కల సాకారం చేసుకున్నాడు. తనకిష్టమైన బెంజ్‌ జీక్లాస్‌ 2022 మోడల్‌ కారుని కొనుగోలు చేశాడు. ‘‘నా డ్రీమ్‌ కారుని నిన్ననే కొనుగోలు చేశాను. మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతోన్న ప్రతివిషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. థ్యాంక్యూ’’ అని విశ్వక్‌ పోస్ట్‌ పెట్టాడు. ఈ కారు విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ ఫొటోలపై దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు. ‘‘ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా’’ అంటూ సరదాగా కామెంట్‌ చేశారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు హీరోకి అభినందనలు చెబుతున్నారు.

మాస్‌ కథలతో అలరించే విశ్వక్ నటించిన క్లాస్‌, కుటుంబ కథా చిత్రమే ‘అశోకవనంలో అర్జునకల్యాణం’. రవికిరణ్‌ కోలా దర్శకుడు. చిన్న సినిమాగా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సక్సెస్‌ని అందుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని