Vishwak Sen: కాంట్రవర్సీకి కారణమదే.. సృష్టించాల్సిన అవసరం నాకు లేదు: విశ్వక్‌సేన్
స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ సినిమా విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విశ్వక్ మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంట్రవర్సీ క్రియేట్ చేసే అవసరం తనకు లేదని యువ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen) తెలిపారు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు తాను ఊరుకోకుండా సమాధానమివ్వడం వల్లే వివాదం జరుగుతుందన్నారు. స్వీయ దర్శకత్వంలో తాను నటించిన కొత్త చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమా మార్చి 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది.
విశ్వక్ మాట్లాడుతూ.. ‘‘ప్రసన్నకుమార్ ఈ సినిమా కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. దాన్ని డెవలప్ చేసే కొద్దీ సినిమా రేంజ్ మారిపోతూ వచ్చింది. స్టోరీ విషయంలో నివేదా కూడా ఓ సలహా ఇచ్చింది. అదేంటో సినిమా విడుదలయ్యాక చెబుతా. నేను సంగీత ప్రియుణ్ని. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి మ్యూజిక్ కావాలో చెప్పగానే లియోన్ జేమ్స్ వెంటనే ఇచ్చేవాడు. తనతో కలిసి మరో చిత్రానికి పనిచేయబోతున్నా’’ అని తెలిపారు. అనంతరం, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
* ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మీరు ఇకపై డైరెక్షన్ ఆపేయాలి’ అని ఎన్టీఆర్ అన్నారు. ఆయన మాట విని వదిలేస్తారా?
విశ్వక్: వదిలేస్తూ పట్టుకుంటుంటా (నవ్వుతూ). ఏదైనా ఆలోచన వస్తే దాన్ని సినిమా రూపంలో మీ అందరికీ చూపించాలనుకుంటా.
* మీ సినిమాల ప్రచారాలకు అగ్ర హీరోలు వస్తుంటారు. ఎలా ఫీలవుతారు?
విశ్వక్: దాన్ని ఆశీర్వాదంలా భావిస్తా. నన్ను అర్థం చేసుకుని, నా సినిమా కోసం వస్తారనుకున్న వారికి విజ్ఞప్తి చేస్తా. అలా ఎన్టీఆర్, రామ్‌చరణ్ తదితరులు రావడం సంతోషం. టాలీవుడ్ హీరోలంతా కలిసి ఉంటారు.
* మల్టీస్టారర్ సినిమాలో నటించే అవకాశం ఉందా?
విశ్వక్: మనం అనుకుంటే అవి జరగవు. భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం.
* నివేదా మిమ్మల్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (ఖైదీ ఫేం)తో పోల్చారు. దాని గురించి..
విశ్వక్: నాకు గ్యాంగ్‌స్టర్ కథలంటే చాలా ఇష్టం. నాకు బాగా నచ్చిన ‘సిటీ ఆఫ్ గాడ్స్’ను తెలుగులో తీయాలనుకున్నా. అలా వచ్చిందే ‘ఫలక్‌నామా దాస్’. కెరీర్ ప్రారంభం కాబట్టి ఏదో తీసేశా. దాన్ని ఇప్పుడు తెరకెక్కించమంటే అద్భుతంగా చేస్తా. గ్యాంగ్‌స్టర్ చిత్రాలను తమిళ దర్శకుడు లోకేశ్ ఎంతగా ఇష్టపడతారో అలానే నేనూ ఇష్టపడతాననే ఉద్దేశంలో నివేదా చెప్పింది.
* బాలకృష్ణకు ఓ కథ చెప్పబోతున్నారని తెలిసింది. నిజమేనా?
విశ్వక్: ప్రస్తుతానికి ‘దాస్ కా ధమ్కీ’ గురించి మాట్లాకుందాం. ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా చెబుతా.
* సినిమాల ప్రచారం కోసం మీరే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారనే టాక్ ఉంది. ఏమంటారు?
విశ్వక్: ఎక్కడైనా ఒక్కడే ఉన్న చోట రాళ్లు వేస్తారు. పదిమంది ఉన్న చోట వేయరు. నేను ఏం జరిగినా ‘మనకెందుకు’ అని అనుకోకుండా సమాధానమిస్తా కాబట్టి కాంట్రవర్సీ జరుగుతుంది. దాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కాంట్రవర్సీ చేసినంత మాత్రాన ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమాకి మార్నింగ్ షోలన్నీ హౌస్‌ఫుల్‌కాలేదు. మార్నింగ్ షో అయ్యాక బాగుందనే టాక్ రావడంతో మ్యాట్నీ షోకి ఎక్కువమంది ప్రేక్షకులు వెళ్లారు
* ప్రెస్‌మీట్ అనంతరం విశ్వక్ ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..
* ‘దాస్ కా ధమ్కీ’ చూసి మేం ఫిదా అవుతామా?
విశ్వక్: తప్పకుండా ఫిదా అవుతారు.
* థియేటర్లలో దుమ్ములేపబోతున్నాం..
విశ్వక్: నెక్ట్స్ లెవల్‌లో.
* మీరు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తారా
విశ్వక్: 8:45 గం.ల షోకు హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్, 11 గంటల షోకు సంధ్య థియేటర్లకు వెళ్తా. రండి కలిసి హంగామా చేద్దాం.
* సినిమాలో ఎన్ని లిప్‌లాప్స్‌కు ఉన్నాయి?
విశ్వక్: పెన్నూ పేపరు తెచ్చుకుని లెక్కపెట్టు!
* ట్విస్ట్‌లు ఏమైనా ఆశించొచ్చా?
విశ్వక్: ట్విస్ట్‌ల మధ్యలో సినిమా ఉంటుంది.
* ఈ సినిమా నేపథ్య సంగీతం సంతృప్తినిచ్చిందా?
విశ్వక్: ఫుల్‌గా. మా లియోన్ జేమ్స్ అదరగొట్టాడు.
* క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్ ఉందన్నారు. హింట్ ఇవ్వొచ్చుగా?
విశ్వక్: సినిమా విడుదలయ్యేంత వరకు ఆగండి.
* ‘దాస్ కా ధమ్కీ’ని ఒక్క మాటలో చెప్పండి.
విశ్వక్: పక్కా మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
* ఈ చిత్రంలో విశ్వక్‌సేన్ మార్క్ ఉంటుందా?
విశ్వక్: పకడ్బందీగా ప్లాన్ చేశాం.
* ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుంది?
విశ్వక్: విశ్వక్: నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్‌ని.
* ఎన్టీఆర్ చిత్రంలో విలన్ పాత్ర అవకాశం వస్తే నటిస్తారా?
విశ్వక్: నటిస్తా.
* ప్రభాస్ గురించి చెప్పండి.
విశ్వక్: డార్లింగ్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers' protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ