Vishwak Sen: ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్‌ చేసిన విశ్వక్‌ సేన్‌!

విశ్వక్‌సేన్‌ చివరిగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో కనిపించారు.  కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం  ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో ప్రసారమవుతోంది.

Published : 28 Jun 2024 12:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటీనటుల్లో యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతుంటారు. తనపై వచ్చిన విమర్శలకు, ట్రోల్స్‌కు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే, తాజాగా విశ్వక్‌ ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్ చేసినట్లు కనిపిస్తుండడంతో ఆయన అభిమానులు ఎక్స్‌లో కామెంట్స్‌ పెడుతున్నారు.

సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103.. లాజిక్‌ ఏంటో చెప్పిన శంకర్‌

తాజాగా విశ్వక్‌సేన్‌ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టారు. సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు అందులో పేర్కొన్నారు. కొన్ని రోజులు పోస్ట్‌లు పెట్టరేమో అని అందరూ భావించారు. కానీ, అసలు ఇన్‌స్టాలో అకౌంట్‌ కనిపించడం లేదు. దీంతో కారణమేంటంటూ ఆయన అభిమానులు ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. యూట్యూబ్‌, సోషల్‌ మీడియాల్లో నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిపై విశ్వక్‌సేన్‌ ఇటీవల ఫైర్‌ అయ్యారు. దీనిపై తన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ఓ యూట్యూబర్‌ ‘కల్కి’ రిలీజ్‌ కాకముందే రివ్యూ ఇవ్వడంపై ఆయన తప్పు పట్టారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని