Vishwak sen: నేనే చేశానన్నంత తృప్తి కలిగింది

‘‘అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్ని చూస్తున్నప్పుడు వాటిలో నన్ను నేను ఊహించుకుంటా. నాకు అన్నీ చేయాలని ఉంటుంది. ఈ ట్రైలర్‌ చూస్తుంటే నేనే చేశాననేంతగా తృప్తిని కలిగించారు విష్వక్‌సేన్‌’’ అన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ.

Updated : 19 Nov 2022 07:04 IST

- బాలకృష్ణ

‘‘అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్ని చూస్తున్నప్పుడు వాటిలో నన్ను నేను ఊహించుకుంటా. నాకు అన్నీ చేయాలని ఉంటుంది. ఈ ట్రైలర్‌ చూస్తుంటే నేనే చేశాననేంతగా తృప్తిని కలిగించారు విష్వక్‌సేన్‌’’ అన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna). ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Daas Ka Dhamki) సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj) కథానాయిక. కరాటే రాజు నిర్మాత. ఫిబ్రవరిలో తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ విడుదల అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ  ‘‘ట్రైలర్‌ కనులవిందుగా ఉంది. రచన, నృత్యాలు, కెమెరా పనితనం బాగున్నాయి. విష్వక్‌ సినిమాపై తపనతో పనిచేస్తుంటారు. ఎన్నో ఒడుదొడుకుల్ని దాటుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా... ఇలా అన్నీ తానై, తన బృందానికి స్ఫూర్తినిస్తూ ఈ సినిమాని పూర్తి చేశారు. ఇప్పుడున్న యువతరంలో ఇలా చేయడం చాలా అరుదు’’ అన్నారు. అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది నా దర్శకత్వంలో ఆదిత్య 999 మ్యాక్స్‌’  మొదలవుతుందని తెలిపారు. విష్వక్‌సేన్‌ (Vishwak Sen) మాట్లాడుతూ ‘‘రాజీ పడకుండా, మనసు పెట్టి సినిమా చేశాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌, యశ్‌, పూర్ణాచారి, ఎడిటర్‌ అన్వర్‌ అలీతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని