Vishwak Sen: ఇలాంటి వారు పైరసీ కంటే ప్రమాదకరం: విష్వక్‌ సేన్‌

‘కల్కి 2898 ఏడీ’ సినిమా ట్రైలర్‌పై రివ్యూ ఇచ్చిన ఓ యూట్యూబర్‌పై హీరో విష్వక్‌ సేన్‌ ఫైర్‌ అయ్యారు.

Published : 19 Jun 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇలాంటి వారు పైరసీ కంటే ప్రమాదకరం’ అంటూ ఓ యూట్యూబర్‌పై యువ నటుడు విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) మండిపడ్డారు. లఘు చిత్రమైనా తీస్తే సినిమా వాళ్ల కష్టాలు తెలుస్తాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే?

గతవారం విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ట్రైలర్‌పై సదరు యూట్యూబర్‌ రివ్యూ ఇచ్చాడు. కథ కొత్తగా ఉన్నా.. కొన్ని అంశాల్లో హాలీవుడ్‌ చిత్రాల పోలికలు ఉన్నాయంటూ సమీక్షించాడు. సంబంధిత విజువల్స్‌ను విష్వక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘సినిమాలు విడుదల అవ్వకముందే.. ఆదాయం కోసం ఇలా యూట్యూబ్‌లో సమీక్షలు ఇస్తున్నారు. ఇండస్ట్రీపై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిశ్రమ మీకు (యూట్యూబర్లు) సరదా అయిపోయింది. మూవీస్‌పై అభిప్రాయాలు వ్యక్తం చేసే వారంతా పది నిమిషాల నిడివి ఉండే లఘు చిత్రాన్నైనా తీయండి. సినీ కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నువ్వు తీయ్‌ షార్ట్‌ఫిల్మ్‌.. అప్పుడు నీ అభిప్రాయానికి గౌరవం ఉంటుంది’’ అని సదరు యూట్యూబర్‌కు సూచించారు.

రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని