Vishwak Sen: ఆ మాట ఒక్కరన్నా.. పరిశ్రమ వదిలేసి వెళ్లిపోతా
‘‘నాకు వృత్తిపట్ల నిబద్ధత లేదని నా సినిమా సెట్‌లో పని చేసిన ఓ లైట్ బాయ్ చెప్పినా సరే చిత్ర పరిశ్రమను వదిలేసి వెళ్లిపోతా’’ అన్నారు కథానాయకుడు విష్వక్‌సేన్.
- విష్వక్‌సేన్
‘‘నాకు వృత్తిపట్ల నిబద్ధత లేదని నా సినిమా సెట్‌లో పని చేసిన ఓ లైట్ బాయ్ చెప్పినా సరే చిత్ర పరిశ్రమను వదిలేసి వెళ్లిపోతా’’ అన్నారు కథానాయకుడు విష్వక్‌సేన్. తనకు నిబద్ధత లేదంటూ నటుడు, దర్శక నిర్మాత అర్జున్ చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. కథలోని లోపాలు సరిదిద్దుకొని చిత్రీకరణకు వెళ్దామన్న సదుద్దేశంతోనే షూట్ ఆపమని కోరాను తప్ప.. సినిమా నుంచి తప్పుకుంటున్నాని చెప్పలేదన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రాజయోగం’ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిరోనక్, అంకిత షా, బిస్మీ నాస్ నాయకానాయికలుగా నటించిన చిత్రమిది. రామ్ గణపతి తెరకెక్కించారు. మణి లక్ష్మణ్‌రావు నిర్మించారు. డిసెంబర్ 9న విడుదలవుతోంది. ఈ వేడుకలోనే ఆయన అర్జున్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. మళ్లీ అలాంటి స్థితిలోకి వెళ్లకూడదనే ప్రతి సినిమానీ ఓ బాధ్యతగా నా భుజాలపై మోసుకుంటూ వస్తున్నా. నా వల్ల ఇప్పటివరకు ఏ నిర్మాత బాధపడలేదు. కథ నచ్చే అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నా. స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చెప్పాలని ప్రయత్నించా. ఆయన తీసుకోలేదు. అయినా సరే సర్దుకుపోయి చేద్దామనుకున్నా. కానీ చిత్రీకరణకు వెళ్దామనుకున్న రోజు లోలోపల భయం అనిపించింది. అందుకే ‘ఈరోజు చిత్రీకరణ వద్ద’ని అర్జున్‌కు సందేశం పంపా. ఉదయం షూట్ అనగా చిత్రీకరణ వద్దనడం తప్పే. కానీ, లోపల అనుమానాలు పెట్టుకొని నాలుగు రోజులు షూట్ చేసి తర్వాత ఆపమనడం ఇంకా పెద్ద తప్పు. అంతే కానీ, ఆయన్ని అవమానించాలని కాదు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరోనక్, రామ్ గణపతి, అంకిత తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Padmini Dian: పొలం పనుల్లో మహిళా ఎమ్మెల్యే
-
Crime News
Couple Suicide: కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్