Vishwak Sen: వాస్తవాలు తెలుసుకోండి.. సినిమా రైట్స్‌ ట్వీట్‌పై విష్వక్‌

తన కొత్త సినిమాకు సంబంధించిన పంపిణీ హక్కుల గురించి ఒకరు ట్వీట్‌ చేయగా హీరో విష్వక్‌ సేన్‌ స్పందించారు.

Published : 13 Jun 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (mechanic rocky). ఈ సినిమా పంపిణీ హక్కుల గురించి ఒకరు ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టగా విష్వక్‌ స్పందించారు. ‘మెకానిక్‌ రాకీ’ రైట్స్‌ను ఇంకా విక్రయించలేదని, వాస్తవాలు తెలుసుకోండంటూ రిప్లై ఇచ్చారు. ఏమైందంటే?

‘కల్కి’ బుజ్జితో ఆనంద్‌ మహీంద్ర.. వీడియో షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ

ఈ చిత్రానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ (ఆలిండియా)ను సొంతం చేసుకున్నట్టు ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు కలిపి రూ. 8 కోట్లకు ఈ సినిమా పంపిణీ హక్కులను ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కొనుగోలు చేసిందంటూ సదరు వ్యక్తి ట్వీట్‌ చేయగా విష్వక్‌ రియాక్ట్‌ అయ్యారు. హక్కులు పొందామని ఆ సంస్థ ప్రకటించినప్పటికీ విష్వక్‌ విక్రయించలేదనడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియుల్లో సందిగ్ధత నెలకొంది. ‘ఇదో కొత్తరకం ప్రచారం’ అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. విష్వక్‌కు ఇది 10వ చిత్రం. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని