Vishwak: ప్రశ్నించే కథతో ‘విశ్వక్‌’

అజయ్‌ కతుర్వాన్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విశ్వక్‌’. వేణు ముల్కాకా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాటికొండ ఆనందం బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు.

Updated : 13 Feb 2022 11:36 IST

అజయ్‌ కతుర్వాన్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విశ్వక్‌’. వేణు ముల్కాకా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాటికొండ ఆనందం బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మూడేళ్ల కష్టం ఈ సినిమా. మేథావులు వలసలు వెళితే ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించే కథ ఇద’’న్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం ఎవరినీ వేలెత్తి చూపించేలా ఉండదు. మంచి విషయం పది మందికి చేరాలనే తపనతో చేశాం’’ అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు సత్యసాగర్‌, ఛాయాగ్రాహకుడు ప్రదీప్‌, ఎడిటర్‌ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని