Vithika: నా భర్త ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు.. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతోంది : వితిక

వరుణ్‌ సందేశ్‌ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయిందని వితిక అన్నారు. ఆయనకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు.

Updated : 17 Jun 2024 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ సందేశ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా రాజేశ్‌ జగన్నాథం దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh) భార్య వితిక మాట్లాడుతూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు. 

‘చాలా రోజుల తర్వాత వరుణ్‌ సినిమా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. ‘నింద’ (Nindha) ప్రమోషన్స్‌లో ఆయన్ని చాలామంది తన కెరీర్‌ ఫెయిల్యూర్‌పై ప్రశ్నలు అడుగుతున్నారు. ‘మీకు అవకాశాలు రావడం లేదు కదా.. మీరు ఫెయిల్డ్‌ యాక్టర్‌ కదా’ ఇలా ప్రశ్నిస్తున్నారు. వరుణ్‌ ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల నుంచి ఎన్నో చిత్రాల్లో నటించారు. సినిమాలు వద్దు అని పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన వాళ్లను ఫెయిల్యూర్‌ యాక్టర్‌ అంటారు. వరుణ్‌ అలా చేయలేదు. ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీ చిత్రానికి 100 శాతం న్యాయం చేస్తాడు. ‘నింద’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని వితిక (Vithika) చెప్పారు.

కమల్‌ హాసన్ బయోపిక్‌.. శ్రుతి హాసన్‌ రియాక్షనిదే

‘నింద’ తనకెంతో ప్రత్యేకమన్నారు వరుణ్‌ సందేశ్‌. ‘ఇప్పటివరకు 20కు పైగా సినిమాలు చేశా. వాటన్నిటికంటే ఇది స్పెషల్‌. ఈ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారు. ఇప్పటివరకు దీన్ని చూసిన వాళ్లు ప్రశంసించారు. రాజేశ్‌ జగన్నాథం భవిష్యత్తులో గొప్ప సినిమాలు తీస్తారు. ‘నింద’ని అందరూ థియేటర్లో చూసి ఆదరించండి’ అని వరుణ్‌ కోరారు. కంటెంట్‌ బాగుంటే సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందని హీరో నిఖిల్‌ (Nikhil) అన్నారు. ఈ చిత్రం వరుణ్‌ కెరీర్‌లో మైలురాయి అవుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని