Vivek Agnihotri: రణ్‌వీర్‌ నగ్న ఫొటోషూట్‌పై పోలీసు కేసు.. ఇది తెలివితక్కువ పని

రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer Singh) వైరల్‌ ఫొటోషూట్‌పై జరుగుతోన్న చర్చలో ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) భాగమయ్యారు. ఓ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌ నగ్నంగా ఫొటోలు దిగడాన్న...

Published : 27 Jul 2022 18:25 IST

ముంబయి: రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer Singh) వైరల్‌ ఫొటోషూట్‌పై జరుగుతోన్న చర్చలో ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) భాగమయ్యారు. ఓ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌ నగ్నంగా ఫొటోలు దిగడాన్ని ఎత్తిచూపుతూ ముంబయిలోని పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు కావడంపై వివేక్‌ స్పందించారు. రణ్‌వీర్‌ చేసినదానిలో తప్పులేదంటూనే కేసులు పెట్టడాన్ని తెలివితక్కువ పనిగా అభివర్ణించారు.

‘‘రణ్‌వీర్‌ ఫొటోషూట్‌ని ఆధారంగా చేసుకుని ముంబయి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం నిజంగా తెలివితక్కువ పని. ఎలాంటి కారణం లేకుండానే అందరి దృష్టిని ఈ విషయం ఆకర్షిస్తోంది. రణ్‌వీర్‌ ఫొటోషూట్‌ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మహిళలు నగ్నంగా ఉన్న ఫొటోలు ఇప్పటికే ఎన్నోసార్లు బయటకు వచ్చాయి. ఆ ఫొటోలు రిలీజైనప్పుడు మగవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయా? నిజం చెప్పాలంటే ఇదొక తెలివితక్కువ చర్చ. దేవుడు సృష్టించిన వాటిల్లో మానవ శరీరం ఎంతో అద్భుతమైన సృష్టి. నాకిలాంటి చర్చలంటే అస్సలు ఇష్టం ఉండదు.’’ అని వివేక్‌ అగ్నిహోత్రి వెల్లడించారు. అనంతరం నటుడు నవదీప్‌ సైతం ఈ విషయంపై స్పందించారు. ‘‘ఎంతోమంది మహిళల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా రణ్‌వీర్‌ ఫొటోలు దిగారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఆయన ఏవిధంగా మహిళల సెంటిమెంట్‌ని దెబ్బతీశారో నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది’’ అని నవదీప్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని