Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్‌ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు

దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War)కు వ్యతిరేకంగా కొంతమంది డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

Published : 24 Sep 2023 11:58 IST

ముంబయి: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files)తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri). ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War). సెప్టెంబర్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వివేక్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ తన సినిమాపై నిషేధం విధించినట్లుందని.. అందుకే ఇప్పటివరకూ ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడలేదని ఆరోపణలు చేశారు. తన సినిమాపై రివ్యూలు చెప్పకుండా ఉండేందుకు ఇప్పటికే చాలామందికి డబ్బులు కూడా పంపిణీ చేశారని ఆయన అన్నారు.

Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

‘‘బాక్సాఫీస్‌ నంబర్ల కోసం పరుగులు పెట్టే రకాన్ని నేను కాదు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ విజయం అందుకున్నాక ఆ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించాలని పేరు పొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు నన్ను సంప్రదించారు. దాదాపు రూ.300 కోట్ల వరకూ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాకపోతే నేను వాళ్ల ట్రాప్‌లో పడలేదు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పడిన కష్టాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలనుకున్నా. అందుకే తక్కువ బడ్జెట్‌లో ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సిద్ధం చేశా. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు వచ్చిన లాభాలను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేశా. ఈ చిత్రానికి సరైన ఆదరణ రాకపోతే నా పరిస్థితి గతంలో మాదిరిగా మారుతుంది’’ అని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని