The Vaccine War: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సంచలన చిత్రం.. ‘ది వ్యాక్సిన్ వార్’

దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి మరో సంచలన చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను నేడు ప్రకటించారు. కరోనా మహమ్మారి, వ్యాక్సిన్‌ నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Updated : 10 Nov 2022 12:32 IST

ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఓ ఆసక్తికర ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో పట్టాలెక్కుతున్న మరో సంచలన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్, ప్రజలు పడిన ఇబ్బందులు, వ్యాక్సిన్ కోసం పడిగాపులు ఇలా ప్రతి అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు.

అంతే కాదు, భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 11 భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ‘ది వ్యాక్సిన్ వార్’ నిర్మిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ తీసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని