Updated : 20 Dec 2021 17:40 IST

VJ sunny Interview: నిజాయతీగా కష్టపడ్డా.. అందుకే బిగ్‌బాస్‌-5 టైటిల్‌ వచ్చింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్న వీజే సన్నీ.. బిగ్‌బాస్‌ సీజన్‌-5(bigg boss telugu 5) విజేతగా నిలిచాడు. 105 రోజుల బిగ్‌ బాస్‌ ప్రయాణంతో పాటు, హౌస్‌మేట్స్‌తో తనకున్న అనుబంధాన్ని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నిజాయతీగా కష్టపడ్డా!

‘‘బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేతగా నిలవడం సంతోషంగా ఉంది. 100శాతం నేను టైటిల్‌ గెలుస్తాననే నమ్మకం ఉంది. నిజాయతీగా కష్టపడ్డా. నాకోసం చాలా మంది ఉన్నారనే ఫీలింగ్‌ లోపల నాకు కలిగింది. ఒకవేళ నేను నిజమైతే నేను గెలుస్తా. నిజం కాదంటే ఓడిపోతా. ఈ రెండే పాయింట్లు నా మదిలో ఉన్నాయి’’

వాళ్ల ఫ్రెండ్‌షిప్‌ అలా.. మాది ఇలా..!

‘‘హౌస్‌లో సిరి-షణ్ముఖ్‌లకు మంచి బాండింగ్‌ ఉంది. చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌షిప్‌. ఒకరినొకరు తినిపించుకునేవారు. జాగ్రత్తలు తీసుకునేవారు. వీళ్లందరికీ కాళ్లకి గాయాలైన సమయంలో నేను కూడా వెళ్లాను. షణ్ముఖ్‌కి కాళ్లు బాగోలేకపోయినా.. సిరిని జాగ్రత్తగా చూసుకున్నాడు. నేనేమో అప్పుడు శ్రీరామ్‌దగ్గర ఉండేవాడిని. మిగిలిన వాళ్లని కూడా నేనే చూసుకునేవాడిని. నాకైతే వాళ్లని చూస్తున్నంత సేపూ ‘దోస్తానా భలే ఉందిరా భాయ్‌’ అనుకునేవాడిని. కాకపోతే మరో పక్క ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము చూసినప్పుడల్లా తినిపించుకోవడం లేదా గొడవపడటం.. మళ్లీ కలిసిపోవడమో ఇలా చేసేవారు. ఇద్దరు గొడవపడతారు.. మళ్లీ వచ్చి హగ్‌ చేసుకుంటారు. ‘హమ్మయ్య కలిసి పోయార్రా భాయ్‌’ అనిపిస్తుంటుంది. హౌస్‌లో ఉన్న వాళ్లలో మానస్‌ నిజాయతీగా ఉండే వ్యక్తి. సెటిల్డ్‌ పర్సనాలిటీ.. ఈ జనరేషన్‌లో ఇంత నెమ్మదిగా ఉండే మనిషిని చూడలేం. అప్పుడప్పుడు మాకూ గొడవలు అయ్యేవి. గంటసేపు కొట్టుకుంటాం. ఫస్ట్‌ నేనే వెళ్లి మాట్లాడతా. ఇక కాజల్‌ను బాగా ఆటపట్టించేవాళ్లం.’’

అనుకోకుండా అపార్థాలు వచ్చాయి!

‘‘ప్రియ చాలా కూల్‌గా ఉంటారు. కానీ, ఏమైందంటే గేమ్‌ పరంగా, వ్యూహపరంగా అనుకోకుండా మా మధ్య అపార్థాలు వచ్చాయి. ముఖ్యంగా లహరి-రవి విషయం జరిగిన తర్వాత మా మధ్య దూరం కూడా పెరిగింది. ఆ టైమ్‌లో ఆవిడ చేసింది కరెక్ట్‌ కావొచ్చు. కానీ, పబ్లిక్‌లో అలా వచ్చేసరికి షాక్‌ అయిపోయా. ఆ తర్వాత టాస్క్‌ల్లో బాగా గొడవ అయింది. నన్ను నేను అదుపులో పెట్టుకున్నా. ఎంతో కంట్రోల్‌ చేసుకునేవాడిని. పరిస్థితి చేయి దాటకుండా చూసుకునేవాడిని. ఆ తర్వాత నా గురించి ప్రియకు మానస్‌ చెప్పడంతో ఆమెకు కూడా అర్థం చేసుకున్నారు. ఆమె వెళ్లేముందు ఇద్దరం చక్కగానే మాట్లాడుకున్నాం’’

ఎలిమినేషన్‌ గురించి ఎప్పుడూ భయపడలేదు!

‘‘హౌస్‌లో నిజాయితీగా ఉన్నానా లేదా?అని మాత్రమే ఆలోచించేవాడిని. ఒక్కోసారి తప్పులు కూడా చేసి ఉంటాను. పక్కన నా డార్లింగ్‌ మానస్‌ వాటిని సరిచేసేవాడు. వీకెండ్‌లో నాగార్జున సర్‌ ఏమైనా అంటే వాటిని ఆశీర్వాదాలుగా తీసుకునేవాడిని. ఎలిమినేషన్‌ గురించి నేనెప్పుడూ భయపడలేదు. నేను గేమ్‌ సరిగా ఆడనప్పుడే ఎలిమినేషన్‌ గురించి భయపడాలి. మేము బెస్ట్ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాం. బెస్ట్‌ ఇచ్చాం’’ అని సన్నీ చెప్పుకొచ్చాడు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని