VV Vinayak: పూరీ అంత అసమర్థుడు కాదు: వి.వి. వినాయక్‌

‘లైగర్‌’ (Liger) పరాజయంతో పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారంటూ వస్తోన్న వార్తలపై దర్శకుడు వి.వి. వినాయక్‌ (VV Vinayak) స్పందించారు..

Published : 24 Sep 2022 02:21 IST

హైదరాబాద్‌: ‘లైగర్‌’ (Liger) పరాజయంతో పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారంటూ వస్తోన్న వార్తలపై దర్శకుడు వి.వి. వినాయక్‌ (VV Vinayak) స్పందించారు. గతంలోనూ పూరీ ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడని, ‘పోకిరి’తో (Pokiri) సూపర్‌హిట్‌ అందుకున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. పూరీ సన్నిహితులకు మాత్రమే ఆయన సామర్థ్యం తెలుసని అన్నారు.

‘‘కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. కానీ, పూరీకి సామర్థ్యం ఉంది. ‘లైగర్‌’ వల్ల తన జీవితం ఏమీ మారదు. ఆయన గతంలోనే ఎన్నో ఫ్లాప్స్‌, హిట్స్‌, సూపర్‌హిట్స్‌ చూశాడు. ఫ్లాప్స్‌ వచ్చినప్పుడు అతడి పని అయిపోయింది  అని అనుకున్నారు.. కట్‌ చేస్తే ‘పోకిరి’తో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాడు. సినిమా అన్నాక ఆర్థికపరమైన ఇబ్బందులు సహజం. దానికి అతడు ముందే సిద్ధంగా ఉంటాడు. ‘లైగర్‌’ వల్ల ఎంత పోయింది? ఎంత వచ్చింది?అనేది అతడికే తెలుసు. పోయినదాన్ని తిరిగి పొందలేనంత అసమర్థుడేమి కాదు. మళ్లీ హిట్‌ కొడితే పూరీ పూరీనే అవుతాడు. ఆయన తెరకెక్కించిన సినిమా ఏదైనా ఫ్లాప్‌ అయితే బయటవాళ్లందరూ ఏవేవో అనేసుకుంటారు. కానీ అతడు అలా కాదు. ఫ్లాప్‌ వస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచించడు. అతడు ఒక యోగి. ధైర్యవంతుడు. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చూసినన్ని కష్టాలు ఎవరు చూసి ఉండరు. ఎన్నో విజయాలు అందుకున్న ఆయన గతంలో ఒక్కసారిగా కిందకి వచ్చేశారు. మళ్లీ బౌన్స్‌బ్యాక్‌ అయ్యారు. సినిమాల్లో ఎత్తుపల్లాలు సర్వసాధారణం’’ అని వినాయక్ వివరించారు.

అనంతరం ‘అదుర్స్‌ - 2’పై వినాయక్‌ స్పందిస్తూ.. ‘‘అదుర్స్‌-2’ లేనట్టే. ఇప్పటికే రెండు కథలు అనుకున్నా. కానీ అవి సరిగ్గా అనిపించలేదు. తారక్‌తోపాటు నాక్కూడా కెరీర్‌లో మంచి పేరు తెచ్చిన చిత్రం ‘అదుర్స్‌’. దాన్ని టచ్‌ చేయకుండా ఉంటేనే మంచిదనిపించింది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని