Tollywood: అతడు.. ఆమె

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌  దర్శకత్వం వహించిన చిత్రం ‘అతడు.. ఆమె.. ప్రియుడు...’. కలర్స్‌ ఆఫ్‌ లవ్‌... అనేది ఉపశీర్షిక. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ ముఖ్య  పాత్రలు పోషించారు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా

Updated : 21 Jan 2022 07:17 IST

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌  దర్శకత్వం వహించిన చిత్రం ‘అతడు.. ఆమె.. ప్రియుడు...’. కలర్స్‌ ఆఫ్‌ లవ్‌... అనేది ఉపశీర్షిక. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ ముఖ్య  పాత్రలు పోషించారు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కూనం కృష్ణకుమారి సమర్పకులు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. నేర నేపథ్యంలో సాగే ప్రేమకథతో చిత్రం రూపొందినట్టు ట్రైలర్‌ని బట్టి స్పష్టమవుతోంది. వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ‘‘రచయితగా ఎన్నో సంచలనాల్ని సృష్టించారు యండమూరి. ఆయన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది. ట్రైలర్‌ చాలా బాగుంద’’న్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మీర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని