Waltair Veerayya: వీరయ్య రాక ఖరారు

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు చిరంజీవి.

Updated : 08 Dec 2022 06:53 IST

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా (Waltair Veerayya) ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ఈ విషయమై ఇప్పటికే స్పష్టత రాగా.. బుధవారం విడుదల తేదీనీ చెప్పేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంలో చిరు ఊర మాస్‌ లుక్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. వినూత్నమైన మాస్‌ యాక్షన్‌ కథాంశంతో బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) (Bobby) తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ నాయిక. ఇందులో హీరో రవితేజ (Raviteja) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌,  ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు