Prabhas ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటా: నటి కృతిసనన్‌

ఇటీవల విడుదలైన ‘మిమీ’ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన బాలీవుడ్‌ అందాల తార కృతిశెట్టి తన తదుపరి చిత్రం ‘ఆదిపురుష్‌’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో సీత పాత్రలో ప్రభాస్‌ పక్కన నటిస్తోంది. రాముడిగా ప్రభాస్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబయిలో ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్‌ ని పూర్తి చేసుకోనుంది.

Updated : 21 Aug 2021 21:56 IST

టైగర్‌ష్రాఫ్‌తో డేట్‌, కార్తిక్‌ ఆర్యన్‌ని ఫ్లర్ట్‌ చేస్తా

ముంబయి: ఇటీవల విడుదలైన ‘మీమీ’ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన బాలీవుడ్‌ అందాల తార కృతిసనన్‌ తన తదుపరి చిత్రం ‘ఆదిపురుష్‌’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో సీత పాత్రలో ప్రభాస్‌ పక్కన నటిస్తోంది. రాముడిగా ప్రభాస్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబయిలో ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్‌ని పూర్తి చేసుకోనుంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ ప్రభాస్‌, టైగర్‌ ష్రాఫ్‌, కార్తిక్‌ ఆర్యన్‌లో ఎవరిని పెళ్లిచేసుకుంటారు?ఎవరితో డేట్‌ చేస్తారు?ఎవరిని ఫ్లర్ట్‌ చేస్తారు? అంటూ ప్రశ్నించగా.. కాస్త ఆలోచించి.. ప్రభాస్‌ని పెళ్లిచేసుకుంటా.. టైగర్‌ ష్రాఫ్‌తో డేట్‌ చేస్తా.. కార్తిక్‌ ఆర్యన్‌ని ఫ్లర్ట్‌ చేస్తా అంటూ సమాధానమిచ్చింది. ఈ వీడియో చూసిన అనంతరం ఆదిపురుష్‌లో ప్రభాస్‌, కృతిసనన్‌ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 11, 2022 నాడు థియేటర్లలో సందడి చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని