Allu Arjun- Hardik Pandya: హార్దిక్‌..నాన్నమ్మ డ్యాన్స్‌ చాలా క్యూట్‌గా ఉంది

పుష్ప’లోని ‘‘చూపే బంగారమాయనే శ్రీవల్లి..’’పాటకు అంతర్జాతీయంగా క్రేజ్‌ సంపాదించుకుంటుంది. సెలబ్రెటీలు వరుస పెట్టి ఈ పాటకు డ్యాన్స్‌ చేయడం ఓ ట్రెండ్‌గా మారింది.

Published : 30 Jan 2022 16:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పుష్ప’లోని ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి..’ పాటకి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ వస్తోంది. సెలబ్రెటీలు సైతం వరుస పెట్టి ఈ పాటకు డ్యాన్స్‌ చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. టీమ్‌ ఇండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య తన నాన్నమ్మతో శ్రీవల్లిపాటకు స్టెపులేసిన వీడియో సంగతి తెలిసిందే. స్టేడియంలో బ్యాటింగ్‌తో అదరగొట్టే హార్దిక్‌.. నాన్నమ్మతో చేసిన శ్రీవల్లి స్టెప్‌తో పాటు చివర్లో చేసిన ‘తగ్గేదేలే’ మ్యానరిజమ్‌ అందరితో వావ్‌ అనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్‌ సైతం ఈ వీడియోపై కామెంట్‌ చేశాడు. ‘‘ మీ ఇద్దరు డ్యాన్స్‌ స్టెప్‌ చాలా చాలా క్యూట్‌గా చేశారు. నా కోసం నాన్నమ్మ డ్యాన్స్‌ గౌరవంగా భావిస్తున్నా’’ అని హార్దిక్‌ పాండ్య, బామ్మ ప్రేమకు ఫిదా అయ్యాడు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌, భారత క్రికెటర్లు సురేష్‌ రైనా ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇలాగే మరికొందరు అలరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని