avika gor: రెండేళ్లుగా అతనితో డేటింగ్ చేస్తున్నా!
నటి అవికాగోర్ రహస్యంగా ఒక శిశువుకు జన్మనిచ్చిందన్న వార్తలపై ఆమె స్పందించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘చిన్నారి పెళ్లికూతురు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికాగోర్.. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్ అవతారమెత్తింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.
ఇంటర్నెట్ డెస్క్: నటి అవికాగోర్ రహస్యంగా ఓ శిశువుకు జన్మనిచ్చిందన్న వార్తలపై ఆమె స్పందించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘చిన్నారి పెళ్లికూతురు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికాగోర్.. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్ అవతారమెత్తింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఒకానొక సమయంలో బొద్దుగా మారడంతో సినిమా అవకాశాలు కోల్పోయింది. తీవ్రమైన మనోవేదనకు గురైన ఆమె క్రమంగా తిరిగి నాజూగ్గా తయారైంది. ఈ క్రమంలోనే ఆమె రహస్యంగా ఓ శిశువుకు జన్మనిచ్చిందన్న వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో తను మళ్లీ మామూలు మనిషిగా మారడానికి కారణం తన ప్రియుడేనంటూ ఆమె చెప్పుకొచ్చింది. అతనితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నానని వెల్లడించింది.
హైదరాబాద్‌కు చెందిన మిలింద్ చంద్వాణీ అనే యువకుడితో కామన్ ఫ్రెండ్స్ ద్వారా అవికాకు పరిచయం ఏర్పడిందట. రెండేళ్ల నుంచి ఇద్దరూ డేటింగ్లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఒక జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనను తాను అర్థం చేసుకోవడానికి మిలింద్ ఎంతో తోడ్పడ్డాడని, శారీరకంగా, మానసికంగా తనలో మార్పు రావడానికి అతనే కారణం అని చెప్పింది. కష్ట సమయాల్లో మిలింద్లాంటి తోడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అంది. తన సహ నటుడు మనీశ్‌రాయ్ సింగన్తో కలిసి రహస్యంగా ఒక శిశువుకు జన్మనిచ్చిందంటూ అవికాపై వస్తున్న వార్తలపై కూడా ఆమె స్పందించింది. మనీశ్ వయసులో తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడని, మంచి స్నేహితుడని ఆమె అంది. తన జీవితంలో అతనికి ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొంది.
నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘థాంక్యూ’ చిత్రంలో అవికా కీలకపాత్ర పోషిస్తోంది. దీంతోపాటు కల్యాణ్‌దేవ్ హీరోగా వస్తున్న మరో చిత్రంలోనూ ఆమె నటిస్తుంది. ఈ రెండు కాకుండా.. మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పుడు బెంగళూరులో.. రేపు ఎక్కడైనా: నీటి విలువపై చిరంజీవి పోస్ట్
బెంగళూరు నీటి సమస్యపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. -
Naga Vamsi: పెద్ద హీరోల సినిమాల్లో లాజిక్‌లు చూడొద్దు: నాగవంశీ
సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలని నిర్మాత నాగవంశీ అన్నారు. ‘గుంటూరు కారం’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక దాన్ని చాలా మంది మెచ్చుకొన్నారని తెలిపారు. -
Tillu Square: తెరపై హాట్‌గా కనిపించడం చాలా కష్టం: అనుపమ పరమేశ్వరన్
స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడం చాలా కష్టమని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ‘టిల్లు స్క్వేర్’ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. -
Vijay Deverakonda: ఇప్పటికీ సర్దుకుపోతుంటా: విజయ్ దేవరకొండ
తన కొత్త సినిమా ‘ఫ్యామిలీస్టార్’ ప్రచారంలో భాగంగా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆ విశేషాలివీ.. -
Social Look: హోలీ స్పెషల్.. రష్మిక వర్కింగ్.. ఫ్యామిలీతో కియారా.. పాయల్, కాజల్ ఇలా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Shruti Haasan: ప్రేమించడం ఒక భ్రమని నమ్ముతున్నా: శృతిహాసన్
హీరోయిన్ శృతిహాసన్ తాను నటించిన ‘ఇనిమేల్’ పాట గురించి తెలిపారు. -
Triptii Dimri: అలా కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం కావాలి: త్రిప్తి డిమ్రి
నటి ప్రియాంక చోప్రా అంటే తనకెంతో ఇష్టమని త్రిప్తి డిమ్రి మరోసారి వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?