Raj Kundra: అశ్లీలత ఉంటుంది.. కానీ అది పోర్న్‌ కాదు: తన్వీర్‌ హష్మీ

అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయన పెట్టిన బెయిల్‌ అభ్యర్థనను కూడా ముంబయి హైకోర్టు కొట్టేసింది. మరో రెండు వారాల పాటు జ్యుడీషియల్‌ కస్టడీని పొడగించింది.

Updated : 29 Jul 2021 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయన బెయిల్‌ అభ్యర్థనను కూడా ముంబయి హైకోర్టు కొట్టేసింది. మరో రెండు వారాల పాటు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది. ఇదిలా ఉండగా, తనను అశ్లీల చిత్రాల్లో నటించాలని రాజ్‌కుంద్రా బలవంతం చేశారంటూ మరో నటి ఆరోపించింది. దీంతో ముంబయి పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. మరోవైపు రాజ్‌కుంద్రా తన పాత ఫోన్‌ను పోలీసులకు దొరక్కుండా ఎక్కడో విసిరేసినట్లు చెప్పడంతో ఆ ఫోన్‌లో మరింత సమాచారం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురు బాలీవుడ్‌ నటులు, నిర్మాతలు, కుంద్రాతో సన్నహితంగా ఉన్నవారిని క్రైమ్‌ బ్రాంచ్‌ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరెస్టయిన మరో నిర్మాత, డైరెక్టర్‌ తన్వీర్‌ హష్మీ బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అతడిని కూడా అధికారులు మూడు గంటల పాటు విచారించారు. అయితే.. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన్వీర్‌ ఆ విషయాలు వెల్లడించారు.

‘‘రాజ్‌ కుంద్రాతో ఉన్న సంబంధం ఏంటని నన్ను ప్రశ్నించారు. అయితే.. నా జీవితంలో నేను ఇంతవరకూ ఒక్కసారి కూడా రాజ్‌కుంద్రాను నేరుగా కలిసింది లేదని తేల్చి చెప్పాను. నేను రాజ్‌కుంద్రా కంపెనీకి సినిమాలు చేస్తుంటాను. 20-25 నిమిషాల నిడివి ఉండే ఆ వీడియోల్లో అశ్లీలత ఉంటుంది. కానీ, వాటిని పోర్న్‌ వీడియోలు అనలేం. అది సాఫ్ట్‌ పోర్న్‌ మాత్రమే. రాజ్‌కుంద్రా కేసు విషయంలో నేను కలగజేసుకోదలచుకోలేదు. ఏదైనా చట్టం చూసుకుంటుంది. అయితే.. చాలా రకాల వేదికలపై అశ్లీల వీడియోలు వస్తున్నాయి. మరి వాటిని ఎవరూ ప్రశ్నించరెందుకు..?’ అని తన్వీర్‌ చెప్పుకొచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని