2020లో ‘క‌ల‌ర్ ఫోటో’.. 2021లో వెబ్ సిరీస్‌ 

సుహాస్‌, చాందిని చౌద‌రి, సునీల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’. సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Updated : 18 May 2021 09:15 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: సుహాస్‌, చాందిని చౌద‌రి, సునీల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’. సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నేరుగా ఓటీటీ ఆహా వేదిక‌గా విడుద‌లై విశేష ప్రేక్ష‌కాద‌రణ‌ పొందింది ఈ ప్రేమ‌క‌థా చిత్రం. ఈ బృందం నుంచి త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్ రానుంది. క‌ల‌ర్‌ఫొటోలో న‌టించిన చాలామంది ఈ సిరీస్‌లోనూ క‌నిపించ‌నున్నారు. ఈ విష‌యాన్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా తెలియ‌జేశారు ద‌ర్శ‌కుడు సందీప్‌. ఓ వీడియో పంచుకుంటూ మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అంటూ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచుతున్నారు. కామెడీ, ఎమోష‌న్‌, ఫాంట‌సీ, అతిథి పాత్ర‌లు.. ఇలా అన్ని ర‌కాల వినోదం ఉంటుంద‌న్నారు.మ‌రి సిరీస్‌లో క‌నిపించే ఆ న‌టులెవ‌రో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ సిరీస్‌కి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు సమ‌కూర్చ‌డం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని