Alia Ranbir: అందుకే అలియా- రణ్‌బీర్‌ పెళ్లి షూట్‌ చేయలేకపోయా: విశాల్‌ పంజాబీ

అలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ల వివాహ వేడుకను తానెందుకు షూట్‌ చేయలేకపోయారో విశాల్‌ పంజాబీ తెలిపారు. ఆయన ఏమన్నారంటే?

Updated : 11 Jul 2024 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరాట్‌ కోహ్లీ- అనుష్కశర్మ, రణ్‌వీర్‌ సింగ్‌- దీపికా పదుకొణె తదితర ప్రముఖుల వివాహ వేడుకను చిత్రీకరించిన వెడ్డింగ్‌ ఫిల్మర్‌ విశాల్‌ పంజాబీ (Vishal Punjabi). అలియా భట్‌ (Alia Bhatt)- రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సైతం తమ వెడ్డింగ్‌ను షూట్‌ చేయాలని కోరగా ఆయన తిరస్కరించారు. దానికి గల కారణాన్ని తాజాగా పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో విశాల్‌ తెలిపారు. ‘‘అలియా, రణ్‌బీర్‌ తమ పెళ్లి (2022 ఏప్రిల్‌ 14)కి కొన్ని వారాల ముందు నన్ను సంప్రదించారు. అప్పటికి నేను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. సెలబ్రిటీ వెడ్డింగ్‌ ఉందనే కారణంతో నేను వేరే వాళ్ల వివాహ వేడుక షూట్‌ను క్యాన్సిల్‌ చేయను. అలియా, రణ్‌బీర్‌ల కంటే ముందు నాకు లండన్‌లో ఓ ఆఫర్ వచ్చింది. అందుకే అలియా వెడ్డింగ్‌ షూట్‌కు నో చెప్పా. వారి వెడ్డింగ్‌ వీడియో చూశా. బాగుంది’’ అని పేర్కొన్నారు.

రవితేజ పాటపై ట్రోలింగ్‌.. హరీశ్‌ శంకర్‌ కౌంటర్‌

ముంబయి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, ది వెడ్డింగ్‌ ఫిల్మర్‌ కంపెనీల సీఈవోగా విశాల్‌ వ్యవహరిస్తున్నారు. ఆయన డైరెక్ట్‌ చేసిన ‘హార్ట్‌బీట్స్‌’.. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన తొలి ఇండియన్‌ వెడ్డింగ్‌ ఫిల్మ్‌గా నిలిచింది. ‘అశోక’, ‘మై హూ నా’, ‘డాన్‌’ వంటి హిందీ చిత్రాలకు ఆయన టీమ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని