Hansika: హన్సికకు కాబోయే వాడికి ఇంతకుముందే పెళ్లైందా..? వీడియో వైరల్..
నటి హన్సిక వివాహం కోసం ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న వేళ సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హన్సిక స్నేహితురాలు రింకీ వివాహానికి సంబంధించిన ఈ వీడియో గురించే ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: పారిస్‌లోని ఈఫిల్ టవర్ సాక్షిగా తన స్నేహితుడు సోహైల్ ప్రేమకు అంగీకారం తెలిపారు నటి హన్సిక (Hansika). ఎంతోకాలం నుంచి మిత్రులైన వీరిద్దరూ త్వరలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం నటి అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న వేళ.. సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హన్సిక స్నేహితురాలి పెళ్లి వేడుకకు సంబంధించిన ఈ వీడియో చూసి నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
హన్సిక స్నేహితురాళ్లలో ఒకరైన రింకీ వివాహం 2016లో జరిగింది. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో గోవాలోని ఓ రిసార్ట్‌లో ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో హన్సిక సైతం పాల్గొని సందడి చేశారు. సంగీత్‌లో రింకీతో కలిసి డ్యాన్సులు కూడా చేశారు. అయితే, రింకీ వివాహమాడింది వేరెవరినో కాదని సోహైల్‌నేనని.. ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లిద్దరూ కొన్నేళ్ల క్రితం విడిపోయారని.. ఇప్పుడు హన్సిక అతడినే వివాహం చేసుకుంటోందని ఈ వీడియో చూసిన నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. వీరి పెళ్లిపై పలు ఆంగ్ల వెబ్‌సైట్లలో వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు రింకీ-సోహైల్ వెడ్డింగ్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిని చూసిన పలువురు అభిమానులు.. ‘‘మేడమ్ ఇది నిజమేనా?’’, ‘‘అప్పట్లో ఆయన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వివాహం చేసుకుంటున్నారు’’ అని కామెంట్స్ పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్