RRR: ఓటీటీలో వారాంత మస్తీ!

మనకు నచ్చిన హీరో సినిమాను థియేటర్లలో చూడడం గొప్ప అనుభూతి. ఒక వేళ కుదరకపోతే..? టీవీలో వచ్చే వరకూ ఎదురు చూడాల్సి వచ్చేది. అప్పుడు సినిమా మధ్యలో ప్రకటనలు, కరెంటు కోతలతో కష్టాలు పడేవాళ్లం.

Updated : 19 May 2022 06:50 IST

నకు నచ్చిన హీరో సినిమాను థియేటర్లలో చూడడం గొప్ప అనుభూతి. ఒక వేళ కుదరకపోతే..? టీవీలో వచ్చే వరకూ ఎదురు చూడాల్సి వచ్చేది. అప్పుడు సినిమా మధ్యలో ప్రకటనలు, కరెంటు కోతలతో కష్టాలు పడేవాళ్లం. ఓటీటీల రాకతో ఇప్పుడా కష్టాలు లేవు. అరచేతిలోని మొబైల్‌తో మనకు నచ్చినపుడు చూడవచ్చు. అలాగే ఇంటిల్లిపాదీ టీవీలో చూసే అవకాశమూ ఉంది. ఈనెల 20(శుక్రవారం)న పలు ఓటీటీ వేదికలపై కొన్ని ఆసక్తికర చిత్రాలు విడుదల కానున్నాయి.

* జక్కన్న రాజమౌళి చెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ నటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన సినిమాల్లో థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శితమైన చిత్రం ఇదే. 20న ఓటీటీ విడుదలకు సిద్ధమయింది. ‘జీ 5’ లో స్ట్రీమింగ్‌కు రానుంది.
* పాదఘట్టం పవిత్రత కోసం మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ చేసిన పోరాటమే ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.
* అపజయాలతో నైరాశ్యంలో కూరుకుపోయి, ఆటకు దూరమైన ఓ క్రికెటర్‌ కథే ‘జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌, మృణాల్‌ ఠాకుర్‌ నాయకానాయికలుగా చేశారు. ఈ ఎమోషన్‌ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది.
* ‘బాణం’ లాంటి చిత్రం తీసిన దర్శకుడు చైతన్య దంతులూరి. తన జోనర్‌ మార్చి ఆయన తెరకెక్కించిన తాజా క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘భళా తందనాన’. ఇందులో శ్రీ విష్ణు అకౌంటెంట్‌గా కనిపించగా ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుగా కేథరిన్‌ నటించింది. తాజాగా ఈ చిత్రం హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని