Parineeti: ఆప్‌ ఎంపీతో డేటింగ్‌ రూమర్స్‌..పరిణీతి స్పందనేంటి?

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్ధా ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా నటి స్పందించిన తీరు వైరల్‌ అవుతోంది.

Updated : 29 Mar 2023 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్‌ చద్ధా (Raghav Chadha), బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్‌ చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పరిణీతి స్పందించారు. ముంబయి ఎయిర్‌పోర్టులో తారసపడిన ఆమెను డేటింగ్‌ రూమర్స్‌పై ఫొటోగ్రాఫర్లు ప్రశ్నించగా.. ఆమె సిగ్గుపడుతూ వెళ్లిపోయారు.  ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న నటితో  ఓ ఫొటోగ్రాఫర్‌ మాట్లాడుతూ..  ‘మేడమ్‌.. మీరు డేటింగ్‌లో ఉన్నారని వస్తున్న వార్తలు నిజమేనా?’’ అని అడిగారు. దీనికి ఆమె  నవ్వుతూ బాయ్‌, గుడ్‌ నైట్‌ అంటూ వెళ్లిపోయారు. అయితే పరిణితీ సిగ్గుపడుతూ సమాధానం దాటవేయడంతో చద్ధాతో ఆమె బంధంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనేమో అని మీడియా కథనాలు వస్తున్నాయి.

రాఘవ్‌ చద్ధాతో కలిసి పరిణీతి లంచ్‌, డిన్నర్లకు వెళ్లడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమవుతోంది.  వారిద్దరూ ప్రేమలో ఉన్నారని కొన్నిరోజులుగా వదంతులు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే ఆప్ ఎంపీ సంజీవ్‌ అరోరా (Sanjeev Arora) మంగళవారం చేసిన ట్వీట్‌ వారి బంధాన్నినిర్ధారించేలా ఉంది. ‘‘పరిణీతి, రాఘవ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి బంధం ప్రేమ, ఆనందంతో నిండిపోవాలి’’అని ఆయన ట్వీట్ చేశారు.  దీంతో వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. రాఘవ్‌ చద్దా పంజాబ్‌ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిణీతి ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌కి జోడీగా ‘క్యాప్సూల్‌ గిల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని