Salman Khan: సల్మాన్‌తో ‘మాణికే మాగే’ పాట పాడించిన యొహాని

సంగీతానికి భాషతో సంబంధం లేదు. సంగీత ప్రియులకు ఏదైనా ఓ పాట నచ్చితే చాలు.. రాత్రికి రాత్రే అది వైరల్‌ అవుతుంది. అందుకు నిదర్శనమే  ‘మాణికే మాగే హితే..!’ పాట. శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ యొహాని డిసెల్వా దీన్ని ఆలపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఆదరణ దక్కింది. దీంతో యొహాన్ని యమా బిజీ అయిపోయారు.

Published : 09 Oct 2021 16:46 IST

మొదటిసారి బుల్లితెరపై మెరిసిన శ్రీలంక గాయని

హిందీ బిగ్‌బాస్‌ 15 షోలో గెస్ట్‌గా సందడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీతానికి భాషతో సంబంధం లేదు. సంగీత ప్రియులకు ఏదైనా ఓ పాట నచ్చితే చాలు.. రాత్రికి రాత్రే అది వైరల్‌ అవుతుంది. అందుకు నిదర్శనమే  ‘మాణికే మాగే హితే..!’ పాట. శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ యొహాని డిసెల్వా దీన్ని ఆలపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఆదరణ దక్కింది. దీంతో యొహాన్ని యమా బిజీ అయిపోయారు. అవకాశాలు తలుపు తట్టడంతో ప్రస్తుతం ఆమె భారతలో పర్యటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లైవ్‌షోలో అదరగొట్టిన ఈ 28ఏళ్ల గాయని.. తొలిసారి బుల్లి తెరపై మెరిశారు. తాజాగా హిందీ బిగ్‌బాస్‌ 15షోలో ఆ పాటను పాడి ఆకట్టుకున్నారు. ఈ షోకి వ్యాఖ్యాత అయిన సల్మాన్‌కు యొహాని ‘మాణికే మాగే..’ పాట నేర్పించే ప్రయత్నించగా.. ఆ పాటంతా సింహళభాషలో ఉండటంతో ఒక్కోపదం పలకడానికి సల్మాన్‌ కష్టపడాల్సి వచ్చింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని