Sridevi: ‘జురాసిక్‌’ పార్క్‌ మూవీని రిజెక్ట్‌ చేసిన శ్రీదేవి.. కారణం అదే!

హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? డబ్బుకు డబ్బు.. కావాల్సినంత ప్రచారం రెండూ ఒకేసారి వచ్చి పడతాయి. అందులోనూ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ మూవీ అంటే కథేంటో కూడా అడగకుండా ఒప్పుకొంటారు.

Updated : 27 May 2023 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? డబ్బుకు డబ్బు.. కావాల్సినంత ప్రచారం రెండూ ఒకేసారి వచ్చి పడతాయి. అందులోనూ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ మూవీ అంటే కథేంటో కూడా అడగకుండా ఒప్పుకొంటారు. కానీ, అలనాటి నటి శ్రీదేవి మాత్రం నో చెప్పారట. ఇంతకీ అదేం సినిమానో తెలుసా? ‘జురాసిక్‌ పార్క్‌’. అవును.. యావత్‌ సినీ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన చిత్రమది. 1993లో విడుదలైన ‘జురాసిక్‌ పార్క్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టింది. అలాంటి చిత్రంలో నటించే అవకాశాన్ని శ్రీదేవి కాదనుకున్నారు. అందుకు గల కారణాన్ని ఆమె నటించిన ‘మామ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చారు.

మీరెందుకు ‘జురాసిక్‌ పార్క్‌’ చేయడానికి నిరాకరించారు అని ‘మామ్‌’ సహ నటుడు అక్షయ్‌ఖన్నా అడగ్గా, ‘ఆ రోజుల్లో హాలీవుడ్‌ సినిమాలంటే ఏలియన్‌లా చేయడమే. కానీ, ఇప్పుడు అదొక గౌరవం. అందుకే ఒప్పుకోలేదు’ అని శ్రీదేవి సమాధానం ఇచ్చారు. కేవలం ‘జురాసిక్‌ పార్క్‌’ మాత్రమే కాదు, శ్రీదేవి కెరీర్‌ టాప్‌లో ఉండగా, వివిధ కారణాల వల్ల చాలా పాత్రలు వదులుకున్నారు. అందులో ‘డర్‌’ కూడా ఉంది. ‘చాందినీ, లమ్హీ తర్వాత డర్‌లో నా పాత్ర చాలా సాధారణంగా ఉంటుందని భావించా. ఒకవేళ షారుఖ్‌ఖాన్‌ పోషించిన పాత్రలాంటిదైతే చేసేదాన్నేమో.ఆ క్యారెక్టరైజేషన్‌ నాకు బాగా నచ్చింది. ఇక జుహీచావ్లాకు అలాంటి పాత్ర కొత్తది. ఆమె సరిగ్గా సరిపోయారు’ అని శ్రీదేవి చెప్పుకొచ్చారు. 2018, ఫిబ్రవరి 24న శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని