POLL: ఎందులో సినిమా చూడటానికి ఇష్టపడతారు?

సినిమా చూడాలి అంటే ఓటీటీ అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటం, కొత్త సినిమా చిత్రీకరణలు ఆగిపోవడంతో ఈ మార్పు వచ్చింది. అయితే అన్నీకుదురుకొని రేపొద్దున మళ్లీ సినిమా

Updated : 20 Jul 2021 18:32 IST

సినిమా చూడాలి అంటే ఓటీటీ అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటం, కొత్త సినిమా చిత్రీకరణలు ఆగిపోవడంతో ఈ మార్పు వచ్చింది. అయితే అన్నీ కుదురుకొని రేపొద్దున మళ్లీ సినిమా థియేటర్లు తెరుచుకున్నా... మొన్నీ మధ్య వరకు ప్రేక్షకులకు ఉన్న ఉత్సాహం ఉంటుందా అనేది ప్రశ్నగా మిగిలింది. గతంలో మాదిరిగా సినిమా థియేటర్లకు జనాలు వస్తారా? ఓవైపు కరోనా భయం ఉండే అవకాశం.. మరోవైపు ఓటీటీల్లో కనిపిస్తున్న వైవిధ్యమే ఇందుకు కారణం. అయితే థియేటర్‌ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ అనేవాళ్లూ ఉన్నారు. ఇటీవల చైనాలో థియేటర్లు ఓపెన్‌ చేస్తే ప్రేక్షకులు వచ్చారు కూడా. మరి ఈ విషయంలో మీరేమంటారు. సినిమాని ఎందులో చూడటానికి ఇష్టపడతారనేది దిగువ పోల్‌లో ఓటేయండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని