Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ ఆస్తులకు వారసులెవరు?

గాన కోకిల, భారత రత్న అవార్డు గ్రహీత.. లతా మంగేష్కర్‌ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. కొన్ని రోజులకే మళ్లీ అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి

Published : 09 Feb 2022 01:56 IST

ముంబయి: గాన కోకిల, భారత రత్న అవార్డు గ్రహీత.. లతా మంగేష్కర్‌ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. మళ్లీ అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల యావత్‌ దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది. మరోవైపు లతా మంగేష్కర్‌కు చెందిన ఆస్తులపై చర్చ జరుగుతోంది. ఆమె వివాహం చేసుకోకపోవడంతో ఆ ఆస్తులకు వారసులు ఎవరువుతారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 

గాయనిగా ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన లతా మంగేష్కర్‌కు దాదాపు రూ.200కోట్లు విలువైన ఆస్తులున్నట్లు సమాచారం. అయితే, ఆమె వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడామె మృతితో తన ఆస్తులకు వారసులు ఎవరన్న ప్రశ్న తలెత్తింది. లతా మంగేష్కర్‌కు ముగ్గురు సోదరీలు, ఒక సోదరుడు ఉన్నాడు. మరోవైపు ఆమె.. తన తండ్రి పేరు మీద ఓ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రూ.200కోట్ల ఆస్తులు ఆమె తోబుట్టువులకు చెందుతాయా? ట్రస్ట్‌కు చెందుతాయా? అనేది తేలాల్సి ఉంది. కాగా.. లతా మంగేష్కర్‌ న్యాయవాదులు ఈ విషయంపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారని ముంబయి సినీ వర్గాలు చెబుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని