Amitabh Bachchan: మనవరాలు నవ్యని మెచ్చుకుంటూ అమితాబ్‌ పోస్ట్‌

‘‘ఈ తాతయ్యకు గర్వకారణం ఈ మనవరాలు నవ్య. ఎందుకంటారా! తనకు తానుగా అన్ని విషయాలు సొంతంగా నేర్చుకుంటుంది. జ్ఞాపకశక్తి ఎక్కువే. డిజిటల్‌ పరంగా ఎన్నో విషయాలు తెలుసు.

Published : 20 Sep 2021 22:32 IST

ముంబయి: ఆమె ఓ బాలీవుడ్‌ అగ్రనటుడి మనవరాలు. అయినా సరే ఆ ఆర్భాటమూ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆమే బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్యా నవేలి నందా. అమితాబ్‌ కుమార్తె శ్వేత తొలి సంతానమే ఈ అమ్మాయి. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నవ్య పియానో ప్లే చేస్తున్న వీడియోని అమితాబ్‌ పోస్ట్‌ చేశారు. ‘‘ఈ తాతయ్యకు గర్వకారణం ఈ మనవరాలు నవ్య. ఎందుకంటారా! తనకు తానుగా అన్ని విషయాలు సొంతంగా నేర్చుకుంటుంది. జ్ఞాపకశక్తి ఎక్కువే. డిజిటల్‌ పరంగా ఎన్నో విషయాలు తెలుసు. సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించి మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తన తండ్రి కుటుంబ బాధ్యతలూ తనే చూసుకుంటోంది. నా మొబైల్‌లో ఏవైనా లోపాలుంటే వెంటనే సవరిస్తుంది. లవ్‌ యూ నవ్యా’’ అంటూ ఆమెను మెచ్చుకున్నారు. చివర్లో కుటుంబానికి కుమార్తెలే ఆస్తి అని వ్యాఖ్య చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని