Nithya Menen: ‘నిత్యా మేనన్‌ ప్రెగ్నెంటా?’.. నటి పోస్ట్‌పై నెటిజన్లు షాక్‌.. ఇదీ సంగతి!

నటి నిత్యా మేనన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది. ప్రెగ్నెన్సీ కిట్‌ ఫొటో షేర్‌ చేస్తూ ‘అద్భుతం మొదలైంది’ అని నిత్య వ్యాఖ్యానించారు. 

Published : 29 Oct 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఏంటీ.. పెళ్లికాకుండానే నిత్యా మేనన్‌ గర్భవతి అయిందా?’ అనే సందేహం మీకూ కలిగిందా? ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయంపైనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. పాజిటివ్‌ రిజల్ట్‌ కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ కిట్‌ను నిత్య (Nithya Menen) తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘అద్భుతం మొదలైంది’ అని వ్యాఖ్యానిస్తూ ప్రెగ్నెంట్‌, లవ్‌ ఎమోజీలను జత చేశారు. అంతకుమించి మరే వివరాలను బయటపెట్టకపోవడంతో అభిమానులు, నెటిజన్లు షాక్‌ అయ్యారు. ‘నిత్యా మేనన్‌కు పెళ్లి ఎప్పుడైంది?’, ‘కంగ్రాట్స్‌’, ‘మీ వివాహం గురించి మాకెందుకు చెప్పలేదు?’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

విషయం ఏంటంటే.. నిత్య తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా ఆ ఫొటోను పంచుకున్నారు. మలయాళీ నటి పార్వతితో కలిసి నిత్యా మేనన్‌ నటిస్తున్న చిత్రం ‘వండర్‌ విమెన్‌’ (Wonder Women). దీన్ని ప్రమోట్‌ చేసేందుకే నిత్యతోపాటు పార్వతి ప్రెగ్నెన్సీ కిట్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో ఉంచారు. పార్వతి అభిమానులూ అలానే షాక్‌కు గురయ్యారు. ఈ మలయాళీ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. కథానాయికలు పంచుకున్న ఫొటోను బట్టి ఈ సినిమా మాతృత్వం నేపథ్యంలో రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. ఈ ఏడాది.. ‘భీమ్లా నాయక్‌’, ‘తిరు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు నిత్య.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని