‘వైల్డ్‌డాగ్‌’: తెరవెనుక కథ: పార్ట్‌-3

నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన

Published : 03 Apr 2021 22:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. తాజాగా విడుదలైన ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇండియ‌న్ ముజాహిదీన్‌కి చెందిన ఖలీద్ ఇండియా నుంచి నేపాల్‌కి వెళ్లాడ‌ని తెలుసుకున్న విజ‌య్ వ‌ర్మ అతడిని మట్టుపెట్టేందుకు త‌న బృందంతో క‌లిసి అక్కడకు వెళ‌తాడు. దేశం కాని దేశంలో విజయ వర్మ, అతని బృందానికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? ఉగ్రవాది ఖలీద్‌ని ఎలా ఇండియాకి తీసుకొచ్చారు? అన్నది చిత్ర కథ.

నాగార్జునతో పాటు, సయామీ ఖేర్‌, అలీ రెజా, మయాంక్‌ ఫరాక్, ప్రకాశ్‌ సుదర్శన్‌, ప్రదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ వర్మ టీమ్‌ బలాబలాలేంటో తెలిపే వీడియోను వైల్డ్‌డాగ్‌ టీమ్‌ పంచుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని