Rajinikanth: మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తోన్న స్నేహితులు

అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ కలిసి నటించేందుకు రంగం సిద్ధమైంది. రజనీ హీరోగా నటించనున్న ఓ సినిమాలో బిగ్‌బి కీలకపాత్ర పోషించనున్నారు.

Published : 10 Jun 2023 23:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth), బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అందాకా నూన్‌’, ‘గిరాఫ్తార్‌’ వంటి సినిమాలు విశేష ప్రేక్షకాదరణ అందుకున్నాయి. మల్టీస్టారర్‌ సినిమాలతో సినీప్రియులను అలరించిన వీరిద్దరూ 1991లో విడుదలైన ‘హమ్‌’ తర్వాత కలిసి నటించలేదు. ఈ క్రమంలోనే సుమారు 32 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయనున్నారని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తాజాగా ప్రకటించింది.

రజనీకాంత్‌ తన 170వ ప్రాజెక్ట్‌ను లైకా బ్యానర్‌లో చేయనున్నారు. ‘జై భీమ్‌’ దర్శకుడు జ్ఞానవేల్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్‌ కీలకపాత్ర పోషించనున్నారని చిత్ర నిర్మాతలు తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రజనీ ప్రస్తుతం ‘జైలర్‌’, ‘లాల్‌ సలామ్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని