Pushpa2: ‘పుష్ప2’ లో ఆ బాలీవుడ్‌ హీరో..?

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ పుష్ప2లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారని. దానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

Published : 06 Oct 2022 11:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా పుష్ప. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయాన్ని అందుకొని పాన్‌ ఇండియా మూవీగా గుర్తింపు తెచ్చుకొంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీలో ఒక బాలీవుడ్‌ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ పుష్ప2లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారని. దానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇదే నిజమైతే అర్జున్‌ కపూర్‌ తెలుగులో నటించే తొలి చిత్రం పుష్ప2నే అవుతుంది. దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. గతంలోనూ ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, మనోజ్‌ బాజ్‌పాయ్‌లు నటిస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే, అలాంటివేవీ లేదంటూ నిర్మాణసంస్థ తెలిపింది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి, ఊ అంటావా పాటలు సోషల్‌ మీడియాను హోరెత్తించాయి. అంతే కాకుండా ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’(సైమా)లో పుష్ప ఆరు అవార్డులను దక్కించుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని