NTR: దేవర ముందే వస్తాడా?

తారల సినిమాలకు సంబంధించి ఈ మధ్య ‘విడుదల వాయిదా’ అనే కబురే ఎక్కువగా వినిపిస్తుంటుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమాల చిత్రీకరణల్లోనూ, నిర్మాణానంతర పనుల్లోనూ జాప్యం చోటు జరుగుతుండడమే అందుకు కారణం.

Published : 13 Jun 2024 00:53 IST

తారల సినిమాలకు సంబంధించి ఈ మధ్య ‘విడుదల వాయిదా’ అనే కబురే ఎక్కువగా వినిపిస్తుంటుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమాల చిత్రీకరణల్లోనూ, నిర్మాణానంతర పనుల్లోనూ జాప్యం చోటు జరుగుతుండడమే అందుకు కారణం. అయితే ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘దేవర’ మాత్రం ముందుగానే రావడానికి ముస్తాబవుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కూడా వేసవిలో రావల్సి ఉండగా, అక్టోబరు 10కి వాయిదా పడింది. అయితే ఈ సారి చెప్పిన సమయం కంటే ముందుగానే, అంటే సెప్టెంబరు 27నే ‘దేవర’ చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 27వ తేదీని ఖరారు చేసుకున్న  పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’ చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తేదీకి ‘ఓజీ’ రావడం కష్టమే. అందుకే ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేయాలనే ప్రణాళికతో చిత్రబృందం అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవల గోవాలో కీలకమైన షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని