RC16: రామ్‌చరణ్ సినిమాలో జాన్వీ నటించనుందా..!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో సినిమా చేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పట్టు సాధించేందుకు చాలా కష్టపడుతోంది. తన నటనతో ప్రశంసలు అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా ‘మిలీ’ అనే చిత్రంలో కనిపించి అలరించింది. ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ పొందకపోయినా జాన్వీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు టాలీవుడ్లోకి అరంగేట్రం చేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో జాన్వీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ రానున్న సినిమాలో ఈ భామ నటించనుందనే వార్తలు వస్తున్నాయి.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది(RC16). ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రంలో జాన్వీ నటించనుందనే వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. రామ్‌చరణ్ సరసన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మను తీసుకునే ఆలోచనలో ఉందట చిత్రబృందం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఇది తెరకెక్కనుంది. ఇక, రామ్‌చరణ్ శంకర్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!
-
Movies News
Michael Review: రివ్యూ : మైఖేల్
-
Movies News
K.Viswanath: ‘కళా తపస్వి’.. ఆ పదం వినగానే భయం వేసింది!