ఆమె నవ్వితే లోకమంతా ఆనందం

మహిళా దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితాల్లో తోడుగా ఉన్న మహిళామణులకు రుణపడి ఉంటామని అంటున్నారు. ఈ సందర్భంగా పలువరు తమ వారితో పంచుకున్న తీయని క్షణాలను, ఆత్మీయుల ఫొటోలను  సామాజిక

Updated : 08 Mar 2021 12:24 IST

మహిళా దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితాల్లో తోడుగా ఉన్న మహిళలకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ వారితో పంచుకున్న మధుర క్షణాలను, ఆత్మీయ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అవేంటో మీరు చూడండి!

మన ఇంట్లోని మహిళలు చిరునవ్వులు చిందిస్తే ప్రపంచమంతా ఆనందంగా  ఉంటుంది. నా లోకంలోని మహిళతో పాటు ప్రపంచంలోని ప్రతీ అతివకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు  -నాగశౌర్య

నా చుట్టూ ఉన్న మహిళలతోపాటు ప్రపంచంలో ఉన్న అతివలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు  -మహేష్‌బాబు

పితృస్వామ్యానికి ఎదురొడ్డి నిలిచి సమాజంలో సమానత్వం ఉండాలనే ప్రాథమిక బాధ్యతను వారు మనకు నేర్పారు. కానీ, నేటికి మనం సమాజంలో జీవనశైలి మెరుగ్గా ఉన్నా.. ఆదర్శంగా మాత్రం లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.  -సుధీర్‌ బాబు

అన్నపూర్ణమ్మతో మొదలైనా ఈ ప్రయాణంలో ఎంతో మంది మహిళలు తోడవుతూ వస్తున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -అన్నపూర్ణ స్టూడియోస్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.  -డైరెక్టర్‌ బాబీ








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని