
‘వావ్ చరిత్రలోనే ఇదొక మరపురాని సంఘటన’: వేణు
హైదరాబాద్: సాయికుమార్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న గేమ్ షో ‘వావ్-3’. పలు ధారావాహికలతో ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటీనటులు, స్నేహితులు తాజాగా ఈ గేమ్ షోలో పాల్గొన్నారు. షో లో భాగంగా సాయికుమార్ తన పంచులతో నవ్వులు పూయించారు. అలాగే బుల్లితెర నటులు రమ్య, సౌమ్య, సుష్మ, వేణు తమ పంచులతో ఎంతగానో అలరించనున్నారు.
షోలో భాగంగా వారు తమ స్నేహం గురించి వెల్లడించారు. ‘రమ్య, సౌమ్య, సుష్మ తనకు సీనియర్స్’ అంటూ అంతే కాకుండా ‘ఆంటీస్‌తో అందమైన అబ్బాయిలు’ అని వేణు వారిని ఆటపట్టించనున్నారు. ఎంతో జోష్‌ఫుల్‌గా సాగుతోన్న ‘వావ్-3’ ఎపిసోడ్‌లోని ఓ రౌండ్‌లో ‘మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, హెచ్‌పీ, అమెజాన్, ఈ కంపెనీల ప్రారంభం విషయంలో ఉన్న సాధారణ లక్షణం ఏమిటి?’ అని సాయికుమార్ ప్రశ్నించగా.. దానికి సమాధానంగా ఓ నటి లాప్‌టాప్ అని అందరినీ విస్మయానికి గురిచేయనున్నారు. షోలో భాగంగా ఓ రౌండ్‌లో ఓ నటి స్టేజిపైనే పడిపోయారు. దాంతో ‘వావ్ చరిత్రలోనే ఇదొక మరపురాని సంఘటన’ అని వేణు సరదాగా పంచులు వేయనున్నారు. మంగళవారం (నవంబర్ 24) రాత్రి ప్రసారం కానున్న ‘వావ్-3’ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమోను చూసేయండి.