Writer Padmabhushan: క్లాప్స్‌తో పాటు క్యాష్ తీసుకొచ్చే చిత్రమిది
సుహాస్ (Suhas) హీరోగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan). అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మించారు.
సుహాస్ (Suhas) హీరోగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan). అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మించారు. టీనా శిల్పరాజ్ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో హీరో అడివి శేష్ (Adivi Sesh) ఈ చిత్ర ట్రైలర్ (Writer Padmabhushan Trailer) విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘సుహాస్ అద్భుతమైన నటుడు. ఇందులో రోహిణీ నటన హృదయాన్ని హత్తుకుంది. వచ్చే నెల 3న థియేటర్లలో కలుద్దాం’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో రాజకీయాలు, నెపోటిజం అని చాలా మాట్లాడుకుంటారు. వాళ్లందరి కంటికి కనిపించే సమాధానం సుహాస్. ఇక్కడ ప్రతిభ మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ ఊహాగానాలు. సుహాస్ సక్సెస్ అందరరికీ ఒక స్ఫూర్తి. ట్రైలర్‌లో నేపథ్య సంగీతం బాగుంది. ప్రశాంత్ ఎంత తెలివైన దర్శకుడో ట్రైలర్ చూస్తున్నప్పుడు అర్థమైంది. చాలా బాగా తీశాడు. చాలా రోజుల తర్వాత తెరపై పుస్తకాలు కనిపించాయి. ఈ చిత్రం గొప్పగా ఆడాలి’’ అన్నారు దర్శకుడు హరీష్ శంకర్. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. తొలిరోజే సినిమా చూడాలనిపించేంత ఆసక్తి కలిగించింది’’ అన్నారు. ‘‘ఇది నా మొదటి థియేట్రికల్ రిలీజ్ చిత్రం. సినిమా చూశాక కచ్చితంగా రెండు మూడు గంటలు హ్యాంగోవర్‌లో ఉంటారు’’ అన్నారు హీరో సుహాస్. దర్శకుడు షణ్ముక ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘క్లాప్స్‌తో పాటు క్యాష్ తీసుకొచ్చే చిత్రమిది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శివ నిర్వాణ, శశి కిరణ్ తిక్క, చంద్రు, టీనా, శరత్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్