Srikanth Vissa: దర్శకత్వమే నా అంతిమ లక్ష్యం
‘‘రావణాసుర’ ఓ విభిన్నమైన థ్రిల్లర్. రవితేజ సినిమాలో ఉండే వినోదం, ఎనర్జీ, పాటలు, యాక్షన్.. అన్నీ ఇందులోనూ కనిపిస్తాయి. వీటితో పాటే మరో ఆసక్తికర అంశం కూడా ఈ చిత్రంలో ఉంది.
‘‘రావణాసుర’ (Ravanasura) ఓ విభిన్నమైన థ్రిల్లర్. రవితేజ సినిమాలో ఉండే వినోదం, ఎనర్జీ, పాటలు, యాక్షన్.. అన్నీ ఇందులోనూ కనిపిస్తాయి. వీటితో పాటే మరో ఆసక్తికర అంశం కూడా ఈ చిత్రంలో ఉంది. అదేంటన్నది తెరపై చూసి తెలుసుకోవాలి’’ అన్నారు రచయిత శ్రీకాంత్ విస్సా (Srikanth Vissa) . ఆయన అందించిన కథతో.. సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రమే ‘రావణాసుర’. రవితేజ కథానాయకుడిగా నటించారు. సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ విస్సా హైదరాబాద్‌లో శుక్రవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
* ‘‘రవితేజను దృష్టిలో పెట్టుకునే సిద్ధం చేసిన కథ ఇది. సినిమా ప్రకటించడానికి ముందే దీనికి ‘రావణాసుర’ అనే టైటిల్ అనుకున్నాం. రావణాసురుడులో చెడు లక్షణాలే కాదు.. కొన్ని మంచి లక్షణాలూ ఉన్నాయి. తను తపస్సు చేశాడు. వీణా విద్వాంసుడు. రాజ్య ప్రజల్ని బాగా చూసుకున్నాడు. కాంచన లంక కట్టాడు. ఆ రావణాసురుడిలో ఎన్ని కోణాలున్నాయో.. మా ‘రావణాసురుడు’లోనూ అన్ని కోణాలు కనిపిస్తాయి. దీనికి ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే ఉపశీర్షిక పెట్టాం. హీరోలు అనే వాళ్లే ఉండరని దానర్థం. ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు. ప్రతి విలన్‌లో ఓ హీరో ఉంటాడు. అదే ఈ చిత్ర కథాంశం’’.
* ‘‘ఈ కథ రాసుకుంటున్నప్పుడు సముద్రఖని లాంటి నటుడికి తగ్గ శక్తిమంతమైన పాత్ర రాసుకున్నా. దాన్ని ఇంకా తీర్చిదిద్దాక.. ఆ పాత్రను ఒక హీరో చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని సుధీర్ వర్మతో పంచుకోగా.. ఆ పాత్రకు సుశాంత్‌ను తీసుకున్నారు. ఇందులో ఆయన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని సుశాంత్ ఎంతో చక్కగా పోషించారు. రవితేజ ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన సలహాల వల్లే తనకు, ఫరియా అబ్దుల్లాకు మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా వచ్చాయి’’.
* ‘‘ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉండాలన్నది రవితేజ నుంచే నేర్చుకున్నా. కొంచెం గట్టిగా మాట్లాడాలని ఆయన నాకెప్పుడూ చెబుతుంటారు. నాకూ దర్శకత్వం చేయాలని ఉంది. అదే నా అంతిమ లక్ష్యం. కానీ, అప్పుడే కాదు. ఇప్పటికైతే పూర్తిగా రచనపైనే దృష్టి పెట్టాను. ప్రస్తుతం నేను కల్యాణ్‌రామ్ ‘డెవిల్’ చిత్రానికి కథ, మాటలు అందించాను. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకి సంభాషణలు అందిస్తున్నాను. అలాగే ‘పుష్ప2’కి పని చేస్తున్నా. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన