Writer review: రివ్యూ: రైటర్
Writer review: సముద్రఖని కీలక పాత్రలో నటించిన ‘రైటర్’ ఎలా ఉందంటే?
Writer review; చిత్రం: రైటర్; నటీనటులు: సముద్రఖని, హరి కృష్ణన్, కెవిన్ జయబాబు, ఇనియా, దిలీపన్, జీఎం సుందర్ తదితరులు; సంగీతం: గోవింద్ వసంత; సినిమాటోగ్రఫీ: ప్రదీప్ కాళీ రాజా; ఎడిటింగ్: మణికందన్ శివకుమార్; నిర్మాత: పా.రంజిత్, అభ్యానంద్ సింగ్, పీయూష్ సింగ్, అదితి ఆనంద్; రచన, దర్శకత్వం: ఫ్లాంక్లిన్ జాకబ్; విడుదల: ఆహా
తెలుగుతో పోలిస్తే ఇతర చిత్ర పరిశ్రమల్లో ప్రయోగాత్మక చిత్రాలు తరచూ పలకరిస్తుంటాయి. కమర్షియల్ హంగులకు దూరంగా కథే పరమావధిగా అవి తెరకెక్కుతాయి. అలా గతేడాది తమిళంలో విడుదలైన చిత్రం ‘రైటర్’. దర్శకుడు పా.రంజిత్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫ్రాంక్లిన్ జాకబ్ తెరకెక్కించారు. విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటి? (Writer review)ఎలా ఉంది?
కథేంటంటే: అమలాపురంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తుంటాడు రంగరాజు(సముద్రఖని). ఉన్నతాధికారులకే కాదు, కింది స్థాయి పోలీసులకు కూడా ఓ సంఘం ఉండాలని, దాని ద్వారా వారి హక్కులను కాపాడుకోవచ్చని న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటాడు. ఇది పై అధికారులకు నచ్చదు. దీంతో అతడిని విశాఖపట్నంలోని మరో పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. పదవీ విరమణకు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో ఎలాగో నెట్టుకొచ్చేద్దామని అక్కడకు వెళతాడు. అదే సమయంలో దేవకుమార్(హరి కృష్ణన్) అనే పీహెచ్డీ విద్యార్థిని ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకుని ఓ లాడ్జిలో పెట్టి విచారిస్తుంటాడు. ఆ యువకుడు తప్పించుపోకుండా చూసే బాధ్యతను రంగరాజుకు అప్పగిస్తారు. ఇంతకీ దేవకుమార్ను ఎందుకు దాచి ఉంచి విచారిస్తున్నారు? ఈ క్రమంలో రంగరాజు చేసిన పని కారణంగా దేవకుమార్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు రంగరాజు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ఇప్పటివరకూ వెండితెరపై అనేక రకాల క్రైమ్ థ్రిల్లర్లు సందడి చేశాయి. ఒక్కో కథది ఒక్కో నేపథ్యం. ఇలాంటి సినిమాలకు కీ పాయింట్ ఎంత బలంగా ఉంటే సినిమా అంత రక్తి కడుతుంది. ఆరంభం నుంచి చివరి వరకూ ఉత్కంఠతో సాగే సన్నివేశాలు ఉంటేనే ఈ సినిమాలు ప్రేక్షకుడిని రంజింపచేస్తాయి. ఈ విషయంలో ‘రైటర్’ ఆ స్థాయి మార్కును అందుకోలేకపోయినా, చివరి వరకూ కథ, పాత్రలను ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో యువ దర్శకుడు ఫ్రాంక్లిన్ జాకబ్ విజయం సాధించారు. రంగరాజుగా సముద్రఖని పాత్ర, అతడి కుటుంబాన్ని చూపిస్తూనే, మరోవైపు పోలీస్ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ కంటే ర్యాంకు తక్కువ ఉన్న ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించే తీరు, ఉద్యోగంలో కులాల ప్రస్తావన ఇలా ఒక్కో అంశాన్ని ప్రస్తావించడం బాగున్నా, సన్నివేశాలు, సంభాషణలు సుదీర్ఘంగా సాగడంతో ఆరంభ సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా సాగుతాయి. దేవ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అతడిని కస్టడిలోకి తీసుకోవడం, లాడ్జిలో ఉంచి విచారించటం, కేసు ఏంటో చెప్పకుండా సంతకాలు పెట్టమనడం ఆయా సన్నివేశాలు ‘నాంది’, ‘విచారణై’ సినిమాలను గుర్తు చేస్తాయి.
దేవకుమార్ అరెస్టు, విచారణతోనే కథ, అందులోని ట్విస్ట్‌లను ద్వితీయార్ధంలో ఒక్కోదాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చాడు దర్శకుడు. దేవ కుమార్‌ను ప్రేమ వ్యవహారం కారణంగా అరెస్టు చేసి ఉంటారని భావించిన ప్రేక్షకుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అసలు విషయం తెలిసిన తర్వాత రంగరాజు కూడా తీవ్ర మానసిన వేదనకు గురవుతాడు. దేవ కుమార్ అరెస్టు వెనుక నేపథ్యంలోనూ పోలీస్ వ్యవస్థలో ఉన్నతాధికారులు వ్యవహరించే తీరు, కులాల ప్రస్తావన ప్రధానంగా చర్చించాడు. పోలీసుల నుంచి దేవకుమార్ను తప్పించేందుకు రంగరాజు చేసే ప్రయత్నాలతో పతాక సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. చివరి 30 నిమిషాలు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కట్టి పడేయటంతో పాటు, భావోద్వేగాన్ని కలిగిస్తాయి.
ఎవరెలా చేశారంటే: రంగరాజు రాజు పాత్రలో సముద్రఖని ఒదిగిపోయి నటించారు. ఇద్దరు భార్యలకు భర్తగా, పదవీ విరమణకు దగ్గరపడిన పోలీసు ఉద్యోగిగా ఆయన నటన బాగుంది. తప్పు చేశామన్న భావనతో తీవ్రంగా మదనపడే సన్నివేశాల్లో ఆయన నటన హైలైట్. దేవకుమార్, ఇన్స్పెక్టర్ శర్మ, పోలీస్ స్టేషన్లో పనిచేసే రాజా ఇలా ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. గోవింద్ వసంత సంగీతం పర్వాలేదు. ఒకట్రెండు పాటలు ఉన్నా పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కథలో ప్రేక్షకుడిని లీనం చేసింది. ప్రదీప్ కాళిరాజా సినిమాటోగ్రఫీ బాగుంది. మణికందన్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. సన్నివేశాలన్నీ సుదీర్ఘంగా సాగాయి. తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో కోసం అలా వదిలేసి ఉండవచ్చు. ఒక పాయింట్‌ను దాచి పెట్టి రెండున్నర గంటల పాటు ఓటీటీలో అదీ మొబైల్/టీవీ ముందు ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం కుదరని పని. తొలి చిత్రమే అయినా, ఫ్రాంక్లిన్ జాకబ్ఎంచుకున్న పాయింట్ బలమైంది. దాన్ని తెరపై చూపించటంతో పాస్ అయ్యారు. కథకు భావోద్వేగాలను జోడించి, హృదయానికి హత్తుకునేలా తెరపై చూపే ప్రయత్నం చేశారు. సినిమా నిడివి తగ్గి, అసలు పాయింట్‌పైనే దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో విధంగా ఉండేది. డిఫరెంట్‌గా ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ‘రైటర్’ ప్రయత్నించవచ్చు. కానీ, కాస్త ఓపిక ఉండాలంతే!
బలాలు
+ సముద్రఖని
+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్
+ సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు
- నెమ్మదిగా సాగే కథనం
- సినిమా నిడివి
చివరిగా: స్లో ‘రైటర్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్